BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో… రెచ్చిపోతున్న పాకిస్తాన్ క్రికెటర్ల తోక ముడిచేందుకు… అడుగులు వేస్తోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India). హరీస్ రవూఫ్ ( Haris Rauf), సాహిబ్జాదా ఫర్హానా ( Sahibzada Farhan ) పై.. ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇవాళ లేదా రేపు ఈ ఇద్దరి పైన ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ నిర్ణయం తీసుకుంది. మొన్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన సందర్భంగా…హరీస్ రవూఫ్ , ఫర్హానా ఇద్దరు… రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టేలా.. సైగలు చేశారు.
మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. ఒకరు గన్ తో పేల్చిన సెలబ్రేషన్స్ చేసుకోగా… మరొకరు ఇండియా జెట్స్ కూల్ చేశామని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సంఘటనపై భారతీయులు అలాగే టీమిండియా క్రికెటర్లు చాలా సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. హరీస్ రవూఫ్ , ఫర్హానా ఇద్దరి పైన జీవితకాల నిషేధం విధించేలా ఐసీసీకి ఫిర్యాదు చేయనుంది బీసీసీఐ.
Also Read: Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌలర్ అబ్రార్ అసభ్యకరమైన సైగలు….ఇచ్చిపడేసిన హసరంగా
🚨 BCCI TAKING ACTION AGAINST RAUF & SAHIBZADA FOR INDECENT BEHAVIOR 🚨
– BCCI has officially lodged a complaint against Haris Rauf & Sahibzada. The Indian team has demanded strict action regarding the provocative & indecent behavior of Sahibzada & Rauf. (Abhishek Tripathi). pic.twitter.com/rBvc8pT8Le
— Tanuj (@ImTanujSingh) September 25, 2025