BigTV English

Maldives Elections Results 2024: మాల్దీవుల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎవరు గెలిచారంటే..?

Maldives Elections Results 2024: మాల్దీవుల ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎవరు గెలిచారంటే..?

Maldives Parliament Elections Results 2024: మాల్దీవుల పార్లమెంటు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయాన్ని సాధించింది. మాల్దీవ్స్ పార్లమెంటులో మొత్తం 93 సీట్లు ఉండగా.. ఆదివారం అర్థరాత్రి వరకు 86 స్థానాలకు ఫలితాలు విడుదలయ్యాయి. అందులో 66 స్థానాలను పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీయే గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనదాని కంటే ఆ పార్టీ ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది. మరో ఏడు నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.


మాల్దీవులలో ఉన్న 93 పార్లమెంటు స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. అయితే, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ముయిజ్జుకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షలా మారగా, చైనా వైపు ముయిజ్జు మొగ్గుచూపడాన్ని ప్రజలు సమర్థిస్తున్నట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో పీఎన్సీ, మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీతో సహా ఆరు పార్టీలకు చెందిన 368 మంది అభ్యర్థులు పోటీ చేశారు.

Also Read: మాల్దీవ్స్ పార్లమెంటులో డిష్యం డిష్యుం.. ఎంపీల మధ్య సీరియస్ ఫైట్!


అదేవిధంగా ఈ ఎన్నికల్లో మొత్తం 41 మంది మహిళలు పోటీ చేయగా కేవలం ముగ్గురు మాత్రం విజయం సాధించారని, మెజార్టీకి అవసరమైన సీట్లను ముయిజ్జు పార్టీ అయిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ కైవసం చేసుకుందని, మే మొదటి వారంలో కొత్త పార్లమెంటు కొలువుదీరే అవకాశముందని అక్కడి మీడియా వెల్లడించింది.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×