BigTV English

Cities Water Crisis in India: మొన్న బెంగుళూరు.. నిన్న కోల్‌కత్తా.. నెక్స్ట్ హైదరాబాదేనా..? నీటి కొరతతో మెట్రో నగరాలు

Cities Water Crisis in India: మొన్న బెంగుళూరు.. నిన్న కోల్‌కత్తా.. నెక్స్ట్ హైదరాబాదేనా..? నీటి కొరతతో మెట్రో నగరాలు

Indian Metropolitan Cities Facing Water Crisis: నీటి కొరత దేశంలో ప్రధాన సిటీలను వెంటాడుతోంది. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న నీటి సమస్య మిగతా సిటీలకు విస్తరిస్తోందా? నీటి ప్రాజెక్టులున్న అధికంగా ఉన్న కర్ణాటకలో నీటి సమస్య ఎందుకు ఎదుర్కొంటోంది? ఈ సమస్య మిగతా మెట్రో‌పాలిటిన్ సిటీలను వెంటాడుతోందా? అవుననే సమాధానం వస్తోంది. బెంగుళూరు తర్వాత ఇప్పుడు కోల్‌కతా వంతైందా? దీని తర్వాత హైరాబాద్ వంతేనా? ఇవే ప్రశ్నలు చాలామంది ప్రజలను వెంటాడుతోంది.


బెంగుళూరు నీటి సమస్య

బెంగుళూరు సిటీకి కావేరి నది నుంచి నీరు వచ్చేది. ప్రస్తుతం రోజుకు 2100 మిలియన్ లీటర్ల అవసరం కాగా, ప్రస్తుతం 1450 మీ.లీటర్లు మాత్రమే బెంగుళూరుకు వస్తోంది. నగరానికి 60 శాతం నీరు ఈ నది నుంచి వస్తోంది. అర్కావతి నది నుంచి కొంత నీరు ఉన్నప్పటికీ అది చాలా తక్కువ. దీంతో బెంగుళూరు లో నీటి అవసరాలకు బోర్లపై ఎక్కువ ఆధారపడుతోంది. ప్రస్తుతం బెంగళూరులో దాదాపు సగం బోర్లు ఎండిపోయాయి. గతేడాది వర్షాలు సరిగా లేకపోవడం దీనికి కారణం. సిటీ పరిధి విస్తరించడం, ఎక్కడ చూసినా నీరు నిల్వ చేసే ప్రదేశాలు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణం. చెరువుల చెట్టూ లేకవ్యూల పేరుతో కాంక్రీటు నిర్మాణాలు వల్ల చెరువుల్లోకి నీరు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీని ఫలితం బెంగుళూరు ఇప్పుడు భయంకరమైన నీటి కష్టాలను ఎదుర్కొంటోంది.

కోల్‌కత్తాది అదే పరిస్థితి కాకపోతే

బెంగుళూరు తర్వాత ఇప్పుడు కోల్‌కత్తాను నీటి సమస్య వెంటాడుతోంది. ముఖ్యంగా భూగర్భ జలాలు ఇంకిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అంతేకాదు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం దీనికి మరో కారణం. గతవారం నుంచి పరిశీలిస్తే.. కోల్‌కతాలోనూ నీటి కొరత సమస్య తీవ్రమవుతోంది. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అధికారి స్థానిక మీడియాతో మాట్లాడారు. సిటీలో పలుప్రాంతాల్లో నీటి కొరత ఉందని అంగీకరించారు. వర్షాలు లేక ప్రాజెక్టులలోని నీటి మట్టాలు తగ్గిపోవడంతో భూగర్భ జలాలపై ఆధారపడే ప్రాంతాలు ముఖ్యంగా ఈ వేసవిలో తీవ్రమయ్యాయన్నది ఆయన మాట. ముఖ్యంగా తూర్పు కోల్‌కత్తా, సౌత్ఈస్ట్ ప్రాంతాలు భూగర్భజలాలపైనే ఆధారపడ్డాయని చెప్పుకొచ్చారు. బస్తీలకు వాటర్ ట్యాంకర్లను పంపిస్తున్నామని గుర్తుచేశారు. స్థానిక అపార్టుమెంట్ వాసులను ఈ కొరత వెంటాడుతోంది. నీటి సమస్య అధికంగా ఉన్న కస్బా, జాదవ్‌పూర్, బెహలా, తిల్జలా, టాప్సియా ప్రాంతాలకు నీటి ట్యాంకర్లను సరఫరా చేస్తోంది కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్.


Also Read: వచ్చే 5 రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఈ రాష్ట్రాల్లోనే!

హైదరాబాద్ మాటేంటి..?

మరి హైదరాబాద్‌ మాటేంటి? ఇక్కడ నీటి సమస్యకు ఎలాంటి ఢోకా లేదన్నది అధికారులు చెబుతున్న మాట. జంట నగరాల వాటర్ బోర్డులు సుమారు కోటి 30 లక్షల ఇళ్లకు నీరు అందిస్తాయి. హైదరాబాద్‌కు బయట నుంచి 2600 పైగానే మిలియన్ లీటర్ల నీరు రోజూ వచ్చే ఏర్పాటు ఉందని చెబుతున్నారు. హైదరాబాద్ సిటీకి నీటి కష్టాలు ఎక్కువగా లేకపోవడానికి కృష్ణా, గోదావరి నదుల నుంచి నీటిని తీసుకోవడమేనని అంటున్నారు. హైదరాబాద్‌కి సింగూరు నుంచి 75 ఎంజీడీ, మంజీరా నుంచి 45, కృష్టా నుంచి 270 ఎంజీసీ యల్లంపల్లి నుంచి గోదావరి నీరు అందుబాటులో ఉందన్నది అధికారుల మాట. ఇవికాకుండా జంట జలాశ్రయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఉన్నాయి. వీటి నుంచి తాగునీటి అవసరాలకు కావాల్సిన నీటిని తీసుకుంటున్నారు. అయితే వీటిలో కొన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి.

నిజానికి హైదరాబాద్ వేగంగా అభివృద్ది చెందుతున్న సిటీల్లో ఒకటి. కాకపోతే బయట నుంచి నీరు రావడంతో ఆ తీవ్రత తెలియడం లేదు. కాంక్రీటు జంగిల్స్ విషయంలో హైదరాబాద్ పరిస్థితి బెంగుళూరు కంటే గొప్పగా లేదు. 111 జీవో వల్ల కొన్ని చెరువుల పరీవాహక ప్రాంతాల్లో ఎత్తయిన కట్టడాలకు కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అయితే కేసీఆర్ సర్కార్ ఈ జీవో రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు లో కేసు నడుస్తోంది. ఈ జీవోను ఎత్తివేస్తే బెంగుళూరు పరిస్థితే హైదరాబాద్ వస్తుందని అంటున్నారు.

Also Read: పద్మ అవార్డుల ప్రదానం.. పద్మవిభూషణ్ అందుకోనున్న వెంకయ్యనాయుడు, చిరంజీవి

హైదరాబాద్ సౌత్‌ ప్రాంతంలో నీటి కొరత ఏర్పడినట్లు వార్తలు లేకపోలేదు. నీటి ట్యాంకర్లపై అపార్టుమెంటు వాసులు ఆధారపడుతున్నారు. ఒక్కో అపార్ట్‌మెంటులో కనీసం దాదాపు 12 ఫ్లాట్లు ఉంటున్నాయి.  వాటర్ కోసం నెలకు 30 వేల రూపాయలను కేటాయిన్నాయి. జలాశ్రయాల వద్ద బోర్లను తీసి అక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా అపార్టుమెంట్లకు నీటిని తరలిస్తోంది వాటర్ మాఫియా. ఈ మధ్యకాలంలో అపార్టుమెంట్ల వద్ద గ్రౌండ్ వాటర్ రాకపోవడంతో కొత్త బోర్లను వేస్తున్నాయి. వెయ్య అడుగుల లోతు బోర్లను వేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే  సౌత్ ప్రాంతంలోనూ భూగర్భజలాలు అడుగట్టడం ఖామమని అంటున్నారు. వీటిపై అధికారులు కొరడా ఝులిపించకపోతే నీటి కష్టాలు తప్పవన్నది నిఫుణుల వాదన. తస్మాత్ జాగ్రత్త..!

Tags

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×