Nancy Pelosi : అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి భర్తపై దాడి జరిగింది. డావిడ్ అనే ఓ దుండగుడు స్పీకర్ నాన్సీ ఇంట్లోకి మారణాయుధాలను తీసుకొని చొరబడ్డాడు. అతని ప్రధాన ఉద్దేశ్యం నాన్సీని హతమార్చాలనుకున్నప్పటీ నాన్సీ అక్కడ లేదు. దీంతో నాన్సీ భర్త పాల్ పై సుత్తెతో దాడి చేశాడు. ‘నాన్సీ ఎక్కడ ఉంది.. అబద్ధాలు ఆడుతోంది.. ఇక్కడ ఉంటే సుత్తెతో మోకాళ్లు విరగ్గొట్టాలనుకున్నా’ అని దాడి చేసిన దుండగుడు నాన్సీ భర్త పాల్‌తో అన్నాడట.
దాడి చేసిన తరువాత రెస్ట్ రూంకి వెళ్లాడు దుండగుడు. అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసి వారికీ వార్నింగ్ ఇచ్చాడు. పోలీసుల విచారణలో అనేక దిగ్భ్రాంతిగల విషయాలు బయటకు వచ్చాయి. నాన్సీ తరువాత మరో కాంగ్రెస్ ప్రతినిధిపైనా డేవిడ్ దాడి చేయాలనుకున్నాడట.. అయితే ఆ విషయలను మాత్రం దుండగుడు బయటపెట్టలేదు. అయితే నాన్సీ పై జరిగిన దాడి పూర్తగా రాజకీయ దాడి అని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులు మండిపడుతున్నారు.