Big Stories

Delhi Pollution Increasing : ఢిల్లీలో రోజురోజుకూ పెరుగుతోన్న కాలుష్యం

Delhi Pollution Increasing : దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత ఎక్కువైంది. ఢిల్లీలో ఎన్సీఆర్‌ పరిధిలో వాయు నాణ్యత నానాటికి క్షీణిస్తుంది. గత 4 రోజులుగా గాలి నాణ్యత సూచిక 300 పైనే ఉంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం నోయిడాలో 406 పాయింట్లుగా నమోదై.. అతి తీవ్రతను సూచిస్తోంది. గురుగ్రాంలో 346, ఢిల్లీ ఎయిర్ పోర్టు సమీపంలో 350 పాయింట్లుగా రికార్డు అయింది. వాయు ప్రమాణాలు క్షీణిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. శ్వాస తీసుకోవడానికి కూడా వీలవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

- Advertisement -

వీలైనంత వరకు ఉద్యోగస్తులు ఇంటి నుంచి పని చేయాలని, వాయు కాలుష్యం లేకుండా చూసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజలు రవాణా కోసం షేరింగ్‌ వాహనాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేసింది. సైకిల్స్‌ను వినియోగించాలని, వీలైనంత వరకు ఇంట్లో నుంచి పని చేసుకోవాలని కోరింది.

- Advertisement -

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News