BigTV English

New zealand: న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

New zealand: న్యూజిలాండ్‌లో ఎమర్జెన్సీ.. ఎందుకో తెలుసా?

New zealand: గాబ్రియేల్ తుఫాన్ దెబ్బకు న్యూజిలాండ్ అతలాకుతలమవుతోంది. ఆ దేశ ఉత్తర భాగంలో తుఫాన్ ధాటికి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ప్రతి గంటకు 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో వేల కుటుంబాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనాలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.


కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు నీట మునగడంతో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. చాలా కమ్యూనిటీల మధ్య సంబంధాలు తెగిపోయాయి. అధికారులు రైల్వే స్టేషన్లు, పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. దేశీయంగా ప్రయాణించాల్సిన 55 విమానాలను రద్దు చేశారు.

ఈక్రమంలో అక్కడి ప్రభుత్వం మూడోసారి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. మొదటిసారి 2011లో క్రైస్ట్‌చర్చ్ భూకంపం సంభవించిన సమయంలో విధించగా.. 2020లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో రెండోసారి విధించింది.


Tags

Related News

Donald Trump: ఆ వ్యాధితో బాధపడుతున్న ట్రంప్.. అందుకేనా ఇంత తేడాగా ఉన్నాడు?

Botulism Outbreak: ఆ సాండ్‌విచ్ తిన్న కొద్ది సేపట్లోనే ప్రముఖ గాయకుడు మృతి.. ఆ కూరగాయే కారణమా?

Trump Tariffs: ట్రంప్ డబుల్ గేమ్! చైనాకు గడువు, ఇండియాపై భారీ పన్ను

planes collided: విమానంపైకి దూసుకెళ్లిన మరో విమానం.. తగలబడిన విమానాలు, వైరల్ వీడియో

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Big Stories

×