BigTV English

Allu Arjun: బాలీవుడ్ మూవీలో బ‌న్నీ..!

Allu Arjun: బాలీవుడ్ మూవీలో బ‌న్నీ..!

Allu Arjun:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. పుష్ప ది రైజ్ సినిమాతో త‌న మార్కెట్‌ను బాలీవుడ్‌లోనూ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు పుష్ప 2తో మ‌రోసారి పాన్ ఇండియా రేంజ్‌లో దండెత్త‌టానికి రెడీ అయిపోయారు. అయితే తాజాగా బ‌న్నీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. అదేంటంటే త్వ‌ర‌లోనే అల్లు అర్జున్ ఓ బాలీవుడ్ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ట‌. అయితే అది ఫుల్ లెంగ్త్ రోల్ కాదు. గెస్ట్ రోల్ మాత్ర‌మే. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ రిక్వెస్ట్ మేర‌కు ఆయ‌న హీరోగా న‌టిస్తున్న సినిమాలో న‌టించ‌టానికి అల్లు అర్జున్ సిద్ధ‌మ‌య్యారట‌.


ఇంత‌కీ అల్లు అర్జున్ గెస్ట్‌గా న‌టించ‌టానికి రిక్వెస్ట్ పంపిన స్టార్ ఎవ‌రో కాదు.. షారూఖ్ ఖాన్‌. ఈయ‌న అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో జవాన్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో అల్లు అర్జున్ న‌టించ‌బోతున్నార‌ట‌. రీసెంట్‌గానే డైరెక్ట‌ర్ అట్లీ అల్లు అర్జున్‌ని క‌లిసి స్టోరి వినిపించార‌ట‌. ఇక అల్లు అర్జున్ సైడ్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ మాత్రం రావాల్సి ఉంద‌ని స‌మాచారం. మ‌రి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వార్త‌ల‌పై అల్లు క్యాంప్ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మ‌రి.

ప‌ఠాన్ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన షారూఖ్ ఖాన్ ఇప్పుడు త‌న ఫోక‌స్ అంతా జ‌వాన్‌పైనే పెట్టారు. బాలీవుడ్ స్టార్స్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్నంగా ఆయ‌న సౌత్‌, నార్త్ యాక్ట‌ర్స్, టెక్నీషియ‌న్స్ కాంబినేష‌న్‌తో జవాన్ సినిమాను చేస్తున్నారు. హీరోయిన్ న‌య‌న‌తార‌, డైరెక్ట‌ర్ అట్లీ సౌత్‌కి చెందిన‌వారే కావ‌టం గ‌మ‌నార్హం. ఇక అల్లు అర్జున్ న‌టిస్తే ఈ రేషియో మ‌రింత పెరిగిన‌ట్లే అనుకోవాలి. అంతే కాకుండా జ‌వాన్‌కి తెలుగు మార్కెట్ ప‌రంగా మ‌రింత గ్రిప్ పెరిగింద‌నే అనుకోవాలి.


Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×