BigTV English

Gorkha soldiers Russia | ‘రష్యా యుద్దం నుంచి నేపాల్ సైనికులు తిరిగి రావాలి’

Gorkha soldiers Russia | తన దేశసైనికులైన గూర్ఖాలను యుక్రెయిన్ యుద్ధం కోసం సైన్యంలో భర్తీ చేయవద్దని రష్యా ప్రభుత్వానికి నేపాల్ కోరింది. ఇప్పటికే రష్యా సైన్యంలో పనిచేస్తున్న నేపాలీ సైనికులను తిరిగి పంపించేయాలని విజ్ఞప్తి చేసింది. రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు ఆరుగురు నేపాలీ సైనికులు చనిపోయారని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.

Gorkha soldiers Russia | ‘రష్యా యుద్దం నుంచి నేపాల్ సైనికులు తిరిగి రావాలి’

Gorkha soldiers Russia | తన దేశసైనికులైన గూర్ఖాలను యుక్రెయిన్ యుద్ధం కోసం సైన్యంలో భర్తీ చేయవద్దని రష్యా ప్రభుత్వానికి నేపాల్ కోరింది. ఇప్పటికే రష్యా సైన్యంలో పనిచేస్తున్న నేపాలీ సైనికులను తిరిగి పంపించేయాలని విజ్ఞప్తి చేసింది. రష్యా-యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు ఆరుగురు నేపాలీ సైనికులు చనిపోయారని నేపాల్ విదేశాంగ శాఖ తెలిపింది.


చనిపోయిన ఆరుగురి మృతదేహాలను నేపాల్ దేశానికి పంపించాలని, వారి కుటుంబాలకు తగిన పరిహారం ఇవ్వాలని కూడా కోరింది. మరో విశేషమేమిటంటే.. నేపాల్ సైనికలు యుక్రెయిన్ సైన్యంలో తరపున కూడా పోరాడుతున్నారు. అలా దాదాపు 150-200 మంది నేపాలీ యువకులు రష్యా సైన్యం తరపున యుక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్నారు. ఇటీవల రష్యా సైన్యం తరపున పోరాడే నేపాలీ సైనికుడి యుక్రెయిన్ సైన్యం పట్టుకొని బంధించింది. అతడిని విడిపించాలని నేపాల్ ప్రభుత్వం రష్యాను ఇప్పటికే పలుమార్లు కోరింది. ఈ మేరకు నేపాల్ విదేశాంగ శాఖ రష్యా అధికారులతో చర్చలు జరుపుతోంది.

ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ దేశ పౌరులెవరూ వేరే యుద్ధాలలో పోరాడుకూడదని కోరింది. నేపాల్‌లో ప్రస్తుతం ఈ సైనికుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. యుద్ధం చేస్తున్న నేపాల్ సైనికులని తిరిగి రప్పించాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.


నేపాల్ సైనికులను గూర్ఖాలంటారు. భారతదేశ సైన్యంలో కూడా గూర్ఖా రెజిమెంట్ ఉంది. బ్రటీస్ కాలం నుంచే గూర్ఖాలు సైన్యంలో పనిచేస్తున్నారు. బ్రిటన్, భారత్ దేశాల సైన్యంలో పనిచేసేందుకు నేపాల్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ఈనాటిది కాదు. 200 ఏళ్ల క్రితం నుంచి కొనసాగుతోంది. గూర్ఖా సైనికులు పోరాట పటిమ, ధైర్య సాహసాల కోసం పేరుగాంచారు.

నేపాల్ దేశంలో తీవ్ర పేదరికం, నిరుద్యోగం వల్ల అక్కడి యువకులు వేరే దేశాలకు వలస వెళుతున్నారు. దక్షిణకొరియా, మలేసియా, పశ్చిమాసియా దేశాలకు వలస వెళ్లి కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్నారు. ఇతర దేశాల సైన్యంలో చేరి పోరాడుతున్నారు. రష్యా సైన్యంలో చేరి యుద్ధంలో పోరాడితే నెలకు మూడు నుంచి నాలుగు లక్షల నేపాలి కరెన్సీ లభిస్తుంది. ఏడాదిపాటు యుద్ధం చేస్తే రష్యా పౌరసత్వం కూడా లభిస్తుంది. కానీ నేపాలీ సైనికులకు రష్యా చెప్పిన వేతనం చెల్లించడం లేదని సైనికుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి.

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికా అండతో రెచ్చిపోయిన పాక్ సైన్యాధిపతి

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×