Samsung Galaxy S25 5G: స్మార్ట్‌ఫోన్ మార్చుకోవాలని ఎదురుచూస్తున్న వారికి శాంసంగ్ గెలాక్సీ S25 5Gపై ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న ఆఫర్ నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. 12GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్‌పై నేరుగా ఇచ్చే భారీ డిస్కౌంట్‌కు తోడు, బ్యాంక్ ఆఫర్, పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ బోనస్ అన్నీ కలుపుకుంటే ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ఊహించనంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఆఫర్ పేజీలో కనిపించే ఆ తక్కువ ధర చూసి వెంటనే కొనాలని డిసైడ్ కావద్దు.
ఎందుకంటే.. ఈ ఆఫర్ అందరికీ ఒకేలా వర్తించదు. మీరు ఎక్స్‌ఛేంజ్‌కు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని కండిషన్‌పై వచ్చే విలువ, అలాగే మీ దగ్గరున్న బ్యాంక్ కార్డు అర్హతలను బట్టి మీరు చివరగా చెల్లించాల్సిన అసలు ధర మారుతుంటుంది. కాబట్టి.. ఈ డీల్‌లో అసలు మ్యాటర్ ఏంటో, ఎవరికి ఎంత వరకు తగ్గింపు వస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ ఫోన్ 12GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.54,999కు లిస్ట్ అయింది. దీని అసలు లిస్టెడ్ ధర రూ.1,04,999గా చూపిస్తున్నారు. అంటే.. దాదాపు 48 శాతం తగ్గింపు కనిపిస్తోంది. దీనికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిక్ బ్యాంక్ ఆఫర్ కింద రూ.1,538 వరకు తగ్గింపు లభించవచ్చ. ఈ తగ్గింపు పొందాలంటే అర్హత ఉన్న కార్డు, చెల్లింపు విధానం వంటి షరతులు వర్తించవచ్చు.
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇచ్చి కొత్త ఫోన్ తీసుకునే వారికి అదనపు ప్రయోజనం ఉండొచ్చు. ముఖ్యంగా iPhone 13 ఎక్స్‌ఛేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.24,250 వరకు విలువ లభించవచ్చని ఆఫర్‌లో పేర్కొన్నారు. బ్యాంక్ తగ్గింపుతో కలిపితే Galaxy S25 ధర రూ.29,211 వరకు తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది గరిష్ఠ ఎక్స్‌ఛేంజ్ విలువను పొందినప్పుడే సాధ్యం. ఫోన్ పని తీరు, మోడల్, స్టోరేజ్ ఆధారంగా అసలు విలువను నిర్ణయిస్తారు.
Also Read: వాట్సప్ గ్రూప్ చాట్‌లో ఇన్నాళ్లూ ఎదురుచూసిన ఫీచర్ వచ్చేసింది.. ఈ 4 మార్పులను గమనించారా?
ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారు 12GB RAM, 256GB వేరియంట్‌ను కూడా చూడొచ్చు. ఈ మోడల్ ధర రూ.60,999గా ఉంది. దీని అసలు లిస్టెడ్ ధర రూ.1,14,999 కావడంతో.. దాదాపు 47 శాతం తగ్గింపు కనిపిస్తోంది. అయితే ఆఫర్ వివరాలు వచ్చిన సమయంలో ఈ వేరియంట్ స్టాక్ తక్కువగా ఉన్నట్లు సమాచారం. కొనుగోలు చేసే ముందు అందుబాటును చెక్ చేయడం మంచిది.
ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు కొనుగోలుపై ఏడు సూపర్ కాయిన్స్ కూడా రావచ్చు. వాటి విలువను కలిపి చూస్తే ఖర్చు సుమారు రూ.29,204కు చేరొచ్చని చెబుతున్నారు. అయినా సూపర్ కాయిన్స్‌ను నేరుగా నగదు తగ్గింపుగా భావించకూడదు. ఆఫర్ గడువు, బ్యాంక్ షరతులు, ఎక్స్‌ఛేంజ్ అర్హత, పాత ఫోన్ విలువ అన్నీ ఆర్డర్ పెట్టే ముందు నిర్ధారించుకోవాలి. చెల్లింపు చివరి దశలో చూపించే మొత్తాన్నే పరిగణనలోకి తీసుకోవాలి. దీంతో ఫోన్‌కు తక్కువ ఎక్స్‌ఛేంజ్ విలువ వస్తే మొత్తం పెరుగుతుంది. అలాగే బ్యాంక్ ఆఫర్ అన్ని కార్డులకు వర్తిస్తుందని అనుకోకూడదు. ధరలు, స్టాక్ ఎప్పుడైనా మారొచ్చు కాబట్టి.. కొనుగోలు చేసే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌లో తాజా వివరాలు చూసి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.
Also Read: రహస్యంగా వీడియోలు తీయడానికి నో ఛాన్స్.. ప్రైవసీకి పెద్దపీట వేస్తూ గూగుల్ కొత్త స్మార్ట్ గ్లాసెస్!