TANA Foundation : తానా అనేది ( Telugu Association of North America) ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల, వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. తెలుగు వారి పండగలను ఈ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ తానాలో నిధులు మళ్లీంపు జరిగినట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
తానా పౌండషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా తన సొంత కంపెనీ ఇర్వింగ్ టెక్సాస్ లో వున్న బృహత్ టెక్నాలజీస్ కి సుమారు మూడు మిలియన్ డాలర్ల పైన నిధులు మళ్లించిన్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారడంతో తానా బోర్డు దీనిపై సీరియస్ అయ్యిందని తెలుస్తుంది. ఈ శ్రీకాంత్ పోలవరపు ఫౌండేషన్ మీటింగ్ లో డిస్కస్ చెయ్యకుండా ఫౌండేషన్ అనుమతి లేకుండా నిధులు మళ్లించారు. తానాకు ప్రస్తుతం చైర్మన్ గా ప్రస్తుతం తానా బోర్డు చైర్మన్ శ్రీ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి మరియు ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శశికాంత్ వల్లేపల్లి శ్రీకాంత్ పోలవరపు ను సంప్రదించగా నిధులు మాయం చెయ్యడం నిజమే అని అది తన సొంత నిర్ణయం అని ఈ సంఘటనకి పూర్తి భాద్యత వహిస్తాను పర్సనల్ ఇమెయిల్స్ ద్వారా ఆయన తెలిపినట్లు తెలుస్తుంది.
నిధుల మళ్లీంపు విషయం పై తానా గత వారం శనివారం అత్యవసర మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. సమావేశం లో బోర్డు సభ్యులు అందరు ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్ళిన నిధులు వెనక్కి తీసుకు రావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని తానా బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఒక్కటే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. నేడు జరిగే మీటింగ్ కు శ్రీకాంత్ పోలవరపు కు సంబంధిత నోటీసులను జారీ చేసింది. తానా సభ్యులకు, అలాగే దాతలకు సమాచారం ఎప్పటికి అప్పుడు అందచేస్తూ అలాగే నిధులు తానా ఫౌండేషన్ అకౌంట్ కి తిరిగి వచ్చేటట్టు న్యాయపరమైన సలహాలు తీసుకుని తగు చర్యలు వెంటనే మొదలు పెడతాము అని ఈ సంఘటన వల్ల తానా ఫౌండేషన్ కార్యక్రమాలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకుంటాం అని బోర్డు చైర్మన్ డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తెలియచేశారు.. దీనిపై త్వరలోనే డబ్బులను తీసుకొచ్చేలా చేస్తామని చెప్పారు.. మరి ఈరోజు జరుగుతున్న మీటింగ్ లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి..