OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నయూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాలు మూవీ లవర్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తాయి. ఈ సినిమాలకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ సినిమాలలో కొన్ని సన్నివేశాలు ఒంటరిగా మాత్రమే చూసే విధంగా ఉంటాయి. థియేటర్లలో యూత్ ని బాగా ఎంటర్టైన్ చేసిన ఒక మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో హల్చల్ చేస్తుంది. ఈ మూవీ పేరేమి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే హాలీవుడ్ మూవీ పేరు “ఇన్ సీక్రెట్” (In Secret). ఈ మూవీ మ్యాటర్ లేని భర్తని బాయ్ ఫ్రెండ్ తో చంపించే ఒక భార్య చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
థెరీసా అనే అమ్మాయికి తల్లి చనిపోవడంతో, తండ్రి తన చెల్లెలు దగ్గర థెరీసాను విడిచి వెళ్ళిపోతాడు. ఆమెకు కమల్ అనే ఒక కొడుకు ఉంటాడు. వీళ్ళిద్దరూ యుక్త వయసుకు రావడంతో కమల్ తల్లి పెళ్లి చేయాలనుకుంటుంది. తెరిసాకు వేరే ఆప్షన్ లేకపోవడంతో కమల్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే కమల్ కు ఆ విషయంలో మేటర్ ఉండదు. తెరిసా వయసులో ఉండటంతో ఆ పని కావాలని తపించి పోతూ ఉంటుంది. ఈ క్రమంలో కమల్ కు, లోరెంట్ అనే ఒక ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతడు ఒకరోజు కమల్ ఇంటికి వస్తాడు. అతన్ని థెరీసా పదేపదే చూస్తూ అతనిని రెచ్చగొడుతుంది. ఈ క్రమంలో వాళ్ళిద్దరూ ఏకాంతంగా గడుపుతారు. ఇక హద్దులు లేనట్టుగా ఎక్కడపడితే అక్కడ అదే పనిలో ఉంటారు. ఒకరోజు కమల్ ఆ ఊరి నుంచి వేరే ఊరికి వెళ్దామని థెరీసాతో చెప్తాడు. ఈ విషయం థెరీసా, లోరెంట్ తో నేను వెళ్తే నిన్ను కలవడం కుదరదు కదా అని బాధపడుతుంది. దానికి లోరెంట్ దీనికి ఒకటే పరిష్కారం, నీ భర్తని చంపేద్దామంటాడు.
అయితే భర్తను చంపడం అంతగా ఇష్టం లేని థెరీసా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే లోరెంట్ కమల్ ని నీళ్లల్లో తోసి చంపి ఆత్మహత్యగా క్రియేట్ చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బాధపడుతున్నట్టు నటిస్తూ ఉంటారు. వీళ్ళు ఎక్కువగా బాధపడుతున్నారని వీళ్ళిద్దరికీ పెద్దలు మళ్లీ పెళ్లి చేస్తారు. ఈ విషయం కోసమే ఎదురు చూస్తున్న లోరెంట్, థెరీసా ఆనందంలో మునుగుతారు. అయితే థెరీసా అత్తగారికి పెరాలసిస్ రావడంతో, ఆమెను కూడా చంపాలని లోరెంట్ చూస్తాడు. ఎందుకంటే ఆమెను చంపితే ఆస్తి మొత్తం తన పేరు మీద వస్తుందని ఆలోచిస్తాడు. ఇద్దరూ ఆమెను చంపడానికి వీల్ చైర్ మీద బయటకు తీసుకువెళ్తారు. చివరికి థెరీసా, కమల్ తల్లిని చంపుతుందా? వీరిద్దరూ చేసిన తప్పులు బయటపడతాయా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.