BigTV English

Tetris Video Game: 13 ఏళ్ల కుర్రాడి చేతిలో టెట్రిస్ చిత్తు.. ప్రపంచ రికార్డు

Tetris Video Game: 13 ఏళ్ల కుర్రాడి చేతిలో టెట్రిస్ చిత్తు.. ప్రపంచ రికార్డు

Tetris Video Game: పిన్నలు, పెద్దలను అలరించే పజిల్ వీడియో గేమ్ టెట్రిస్. ఆవిష్కరించి 34 ఏళ్లు అయినా.. ఆ గేమ్‌కు ఆదరణ ఏ మాత్రం చెక్కుచెదరలేదు. సోవియట్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అలెక్సీ పజిత్నోవ్ 1985లో దీనిని రూపొందించారు. తొలిసారిగా ఈ గేమ్‌పై ఓ కుర్రోడు పై చేయి సాధించాడు. 13 ఏళ్ల అమెరికన్ విల్లీస్ గిబ్సన్ టెట్రిస్‌ను బీట్ చేసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. ఓవరాల్ స్కోర్ సాధన విషయంలోనూ గిబ్సన్‌ది ప్రపంచ రికార్డే. ఇంతవరకూ ఎవరూ ఈ గేమ్‌లో లెవల్-30 దాటలేదు.


ఓక్లహామాకు చెందిన గిబ్సన్ ఏకంగా లెవల్-157కి చేరడంతో గేమ్ క్రాష్ అయింది. కేవలం 38 నిమిషాల్లోనే ఈ గేమ్‌ను బీట్ చేయగలిగాడు. పజిత్నోవ్ 1984లో సృష్టించిన ఈ గేమ్‌.. నిన్‌టెండో ఎంటర్టెయిన్‌మెంట్ సిస్టమ్(NES) అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాతే ఆదరణ పెరిగింది. 1989లో నిన్ టెండో హ్యాండ్‌హెల్డ్ కన్సోల్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఈ గేమ్ మొబైల్ ఫోన్లు సహా వివిధ కన్సోల్స్, ప్లాట్‌ఫ్లామ్‌లపై అందుబాటులో ఉంది.

2010లో ప్రముఖ గేమర్ థోర్ ఆకర్లండ్ లెవల్-30కి మాత్రం చేరుకోగలిగారు. గత నెలలోనే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ ప్రోగ్రాం టెట్రిస్ కిల్ స్క్రీన్‌కు చేరుకోగలిగింది. కిల్ స్క్రీన్ అంటే.. గేమ్ క్రాష్ అయ్యే లెవల్‌కు ప్లేయర్ చేరుకోవడమన్నమాట. ఇలా కిల్ స్క్రీన్ కు చేరుకున్న తొలి మానవమాత్రుడిగా విల్లీస్ గిబ్సన్ రికార్డులకు ఎక్కాడు. గిబ్సన్ గేమ్ ఆడుతుండగా.. 38వ నిమిషంలోనే స్క్రీన్ క్రాష్ అయింది. ఇంత స్వల్ప వ్యవధిలోనే గేమ్‌ను బీట్ చేయగలిగాడు గిబ్సన్.


ఈ టీనేజర్ తన 11వ ఏట నుంచే గేమ్ ఆడటం ఆరంభించాడు. ఇప్పటికే పలు టోర్నీల్లో పాల్గొన్నాడు. మూడున్నర దశాబ్దాలుగా వీడియో గేమ్ ప్రపంచంలో టెట్రిస్ ఓ సంచలనం. గేమర్లలో దీనికి అమితమైన ఆదరణ ఉంది. ఆల్ టైం బెస్ట్ సెల్లింగ్ వీడియో గేమ్‌గా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు టెట్రిస్ గేమ్ 520 మిలియన్ కాపీలు అమ్ముడైంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×