BigTV English

Sam Altman : బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈఓ .. హవాయ్‌లో వేడుక..

Sam Altman : ప్రముఖ సంస్థ ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆల్ట్‌మన్‌ ఓ ప్రముఖ మీడియా సంస్థకు తమ వివాహ విషయాన్ని తెలియజేశాడు. అతి కొద్ది మంది సన్నిహితులు మధ్య వివాహం జరిగనట్లు సమాచారం. హవాయ్ నగరంలో ఉన్న సముద్రపు ఒడ్డున ఈ వేడుక జరిగింది.

Sam Altman : బాయ్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన ఓపెన్ఏఐ సీఈఓ .. హవాయ్‌లో వేడుక..

Sam Altman : ప్రముఖ ఓపెన్‌ ఏఐ సంస్థ సీఈఓ శామ్‌ ఆల్ట్‌మన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ ఆలివర్‌ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆల్ట్‌మన్‌ ఓ ప్రముఖ మీడియా సంస్థకు తమ వివాహ విషయాన్ని తెలియజేశాడు. అతి కొద్ది మంది సన్నిహితులు మధ్య వివాహం జరిగినట్లు సమాచారం. హవాయ్ నగరంలో ఉన్న సముద్రపు ఒడ్డున ఈ వేడుక జరిగింది.


మల్హెరిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఆస్ట్రేలియా దేశానికి చెందిన వ్యక్తి. మెల్‌బోర్న్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు. ఆయన ఆగస్టు 2020 నుంచి 2022 నవంబర్‌ వరకు మెటాలో పనిచేశారు. అయితే ఆల్ట్‌మన్‌, మల్హెరిన్‌ తమ బంధం గురించి ఏవరికి తెలియనీవ్వలేదు. తాము ఇద్దరమూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నామని 2023 న్యూయార్క్‌ మ్యాగజైన్‌‌లో‌ ప్రకటించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విందులో తొలిసారిగా ఆల్ట్‌మన్‌, మల్హెరిన్‌తో కలిసి వచ్చారు.

సీఈఓగా శామ్‌ ఆల్ట్‌మన్‌ ఏఐ చాట్‌బాట్‌, చాట్‌జీపీటీ‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. గత ఏడాది ఆయనపై ఉద్యోగులు, వాటాదారులు నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇటీవలే ఆయనను కంపెనీ బోర్డు నుంచి తొలంగించారు. ఆయనను తొలగించడం తీవ్ర వివాదానికి దారి తీసింది. హైస్కూల్‌లో ఉన్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్‌ ప్రకటించుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్‌ సంస్థ సహవ్యవస్థాపకుడు నిక్‌ సివోతో శామ్‌ ఆల్ట్‌మన్‌ డేటింగ్‌ చేసి 2012లో విడిపోయారు.


Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×