BigTV English

operation spiderweb: పెద్ద ప్లానింగే.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఎలా జరిగిందో తెలిస్తే షాకే

operation spiderweb: పెద్ద ప్లానింగే.. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్ ఎలా జరిగిందో తెలిస్తే షాకే

ఇదీ కదా ప్లానింగ్ అంటే. ఇలా కదా శత్రువుని చావుదెబ్బ కొట్టాల్సింది. ఇదే కదా ఆధునిక యుద్ధ తంత్రం. ఇలా ఉక్రెయిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకంటే పెద్ద దేశం, తనకంటే గొప్ప దేశం, గొప్ప ఆయుధ సంపత్తి ఉన్న దేశం. అలాంటి రష్యానే కాళ్లబేరానికి తెచ్చుకుంది ఉక్రెయిన్. ఏళ్లతరబడి జరుగుతున్న యుద్ధంలో ఒకే ఒక్క కుదుపు. సడన్ గా డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్, రష్యా లోని వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. యుద్ధ విమానాలను ధ్వంసం చేసింది. ఇంతవరకు ఓకే. అయితే ఈ ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు అనేదే ఇప్పుడు అసలు పాయింట్.


చెప్పుకుంటే పరువు తక్కువ..
ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి రష్యాలో 41 బాంబర్ విమానాలు ధ్వంసమయ్యాయి. ఈ ధ్వంస రచనకు ఉక్రెయిన్ పెట్టుకున్న పేరు ఆపరేషన్ స్పైడర్ వెబ్. దీనికోసం ఏడాదిన్నరగా ప్లాన్ చేసింది. రష్యా దేశానికి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. దానిపేరు ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్(FSB). FSB ప్రధాన కార్యాలయం పక్కనే ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం ఈ ఆపరేషన్ లో కీలక అంశం. రష్యా ఇంటెలిజెన్స్ కే వారు పరీక్ష పెట్టారు. కానీ వారు ఫెయిలయ్యారు. శత్రువుల జాడ కనుక్కోవడం, శత్రు దేశాల్లో ఆపరేషన్లు నిర్వహించడం రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ పని. కానీ శత్రువే తన దేశంలోకి వచ్చినా వారు కనుక్కోలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే.. ఆ శత్రువు తన పక్కింట్లోనే దిగినా కనిపెట్టలేని దద్దమ్మ ఇంటెలిజన్స్ రష్యాది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు గర్వంగా చెబుతున్నారు. రష్యాలోని FSB కార్యాలయం పక్కనే తమ గూఢచారులు కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకున్నారని వివరించారు.

సూసైడ్ డ్రోన్స్..
ఆపరేషన్‌ స్పైడర్‌ వెబ్‌ కోసం ఉక్రెయిన్‌ సూసైడ్ డ్రోన్స్ వాడింది. అంటే ఆ డ్రోన్లు.. రష్యాలోకి వెళ్లి అక్కడ టార్గెట్లను ధ్వంసం చేస్తాయి. ఆ క్రమంలో తమని తాము పేల్చేసుకుంటాయి. తమలోని మందుగుండుని పేల్చేసుకుని టార్గెట్ ని నాశనం చేయడమే సూసైడ్ డ్రోన్ పని. అలా ఉక్రెయిన్ 117 ఫస్ట్‌ పర్సన్‌ వ్యూ సూసైడ్ డ్రోన్స్ ని వాడింది. అయితే ఈ ఆపరేషన్ అంతా రష్యాలోనే జరిగింది. చెక్కతో చేసిన క్యాబిన్లలో ఈ డ్రోన్లను పెట్టి వాటిని పెద్ద పెద్ద ట్రక్కులపై ఉంచి వైమానిక స్థావరాల వద్దకు చేర్చింది. దీనికోసం రష్టాలోని స్థానిక డ్రైవర్లను నియమించుకున్నారు ఉక్రెయిన్ గూఢచారులు. సరిగ్గా మధ్యాహ్నం సమయంలో.. లారీలలోని చెక్క క్యాబిన్ల డోర్లను రిమోట్‌ సాయంతో తెరిచారు. ఆ తర్వాత డ్రోన్లు సడన్ గా గాల్లోకి ఎగిరాయి. ఆ లారీల్లోనే ఉన్న ఉక్రెయిన్ సిబ్బంది వాటిని రిమోట్ తో ఆపరేటజ్ చేశారు. వాటిని రష్యాలోని బాంబర్ విమానాలపై కి మళ్లించారు. ఇంకేముంది టార్గెట్ ని రీచ్ అయ్యాక సూసైడ్ డ్రోన్లు పేలిపోయాయి, వాటితోపాటు ఆ బాంబర్ విమానాలు కాలి బూడిదయ్యాయి.


పెద్ద ఎదురుదెబ్బ..
రష్యాకి ఇది పెద్ద ఎదురు దెబ్బ. ఎందుకంటే, ఆ యుద్ధ విమానాల తయారీని రష్యా ఇదివరకే ఆపివేసింది. అంటే వాటిని తిరిగి తయారు చేయడం అసాధ్యం. ఉక్రెయిన్ దాడిలో TU-95, TU-22M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ధ్వంసమయ్యాయి. ఇలాంటి విమానాలు రష్యా వద్ద 120 వరకు ఉన్నాయి. వాటిలో 41 ఇప్పుడు నాశనం అయ్యాయి. ఉక్రెయిన్ తో రష్యా చేసే యుద్ధంలో ఇవే కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి విమానాలను ఉక్రెయిన్ మట్టుబెట్టడం వారికి పెద్ద విజయంగా చెప్పాలి. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ దాడిని పెరల్ హార్బర్ ఘటనతో పోల్చడం విశేషం.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×