BigTV English

Ameer Balaj Tipu: పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి..

Ameer Balaj Tipu: పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్‌స్టర్ మృతి..

Ameer Balaj Tipu Shot Dead: పాకిస్థాన్‌లో దాడులు, గ్యాంగ్‌స్టర్ల హత్యలు సర్వ సాధారణం అయిపోయాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. ఎప్పుడూ గట్టి సెక్యూరిటీ, చుట్టూ బాడీగార్డ్‌లతో తిరిగే ఓ గ్యాంగ్‌స్టర్ పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. లాహోర్‌లో ఓ పెళ్లి వేడుకలో పాల్గొన్న అండర్ వరల్డ్ డాన్‌ను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ ఘటనతో ఆ పెళ్లి వేడుకకు వచ్చిన వారు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. ఈ ఘటన లాహోర్ నగరంలో సంచలనంగా మారింది.


పాకిస్థాన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాహోర్‌లో గ్యాంగ్‌స్టర్‌గా ఎదిగిన అమీర్ బలాజ్ టిప్పుపై గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆయన సన్నిహితులు సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. పెళ్లి వేడుకలో అమీర్ బలాజ్ టిప్పు చుట్టూ ఉన్న బాడీగార్డ్‌లు కాస్త రిలాక్స్‌గా ఉంటారని దుండగులు భావించి.. అతడ్ని అదును చూసి కాల్చి చంపినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Read More: భారతీయ అమెరికన్.. జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికైతే రికార్డే!


లాహోర్‌లో కొన్ని సంవత్సరాలుగా అమీర్ బలాజ్ టిప్పు గ్యాంగ్‌స్టర్‌గా చలామణి అవుతున్నాడు. దీంతోపాటు వస్తువుల ట్రాన్స్‌పోర్ట్ నెట్‌వర్క్ బిజినెస్ చేసే అమీర్ బలాజ్‌పై లాహోర్ నగరంలో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 18న రాత్రి లాహోర్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో అమీర్ బలాజ్ పాల్గొనగా.. హతం అయ్యాడు.

అయితే అమీర్ చుట్టూ ఎప్పుడూ సుమారు 10 మంది బాడీగార్డ్‌లు తుపాకులతో రక్షణ కల్పిస్తూ ఉంటారు. అంత పకడ్బందీ సెక్యూరిటీ ఉన్న అమీర్‌ను దుండగులు కాల్చి చంపడం లాహోర్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అమీర్‌పై కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అతని సెక్యూరిటీ కాల్చి చంపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే గ్యాంగ్‌స్టర్ అమీర్‌తో వ్యక్తిగత కక్షలు ఉన్న ముఠాలే ఈ కాల్పులు జరిపి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పాకిస్థాన్ పోలీసులు ప్రకటించారు.

పాకిస్తాన్‌లోని అండర్ వరల్డ్ డాన్‌లలో ఒకడిగా గుర్తింపు పొందిన అమీర్ బలాజ్ టిప్పు హత్యతో పాక్ పోలీసులు, అధికారులు అప్రమత్తం అయ్యారు. టిప్పు హత్యకు ప్రతీకారంగా మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలక ప్రాంతాల్లో భారీగా బందోబస్తును ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అమీర్ బలాజ్ టిప్పు ఇటీవలే పాకిస్థాన్ ఎన్నికల ముందు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ నవాజ్ పార్టీలో చేరాడు.

ఇక అమీర్ బలాజ్ టిప్పు మాత్రమే కాకుండా అతని కుటుంబానికి కూడా నేరచరిత్ర ఉంది. అమీర్ బలాజ్ తండ్రి ఆరిఫ్ అమీర్‌ను కూడా 2010 లో అల్లామా ఇక్బాల్‌ విమానాశ్రయంలో జరిగిన తుపాకీ కాల్పుల్లో మరణించాడు. ఆ తర్వాత తండ్రి బాధ్యతలను తీసుకున్న బలాజ్ టిప్పు లాహోర్ అండర్ వరల్డ్ డాన్‌గా ఎదిగాడు. చివరికి తాను కూడా తండ్రి లాగే కాల్పులకు హతం అయ్యాడు.

Tags

Related News

Nuclear Threat: ఇండియాను అణుబాంబులతో లేపేస్తాం.. అమెరికాలో పాక్ సైన్యాధిపతి చెత్త వాగుడు

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Big Stories

×