Indian American Ashwini Ramaswamy: భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి అమెరికాలోని జార్జియా చట్టసభ్యుడిగా ఎన్నికై రికార్డు సృష్టించనున్నారు. అమెరికాలోని జార్జియా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్న మొదటి జనరల్ జెడ్ (1997-2012 మధ్య పుట్టినవాళ్లు) భారతీయ అమెరికన్ అశ్విన్ రామస్వామి నిలిచారు. అయితే 34 ఏళ్ల క్రితం భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ కుటుంబానికి చెందిన 24 ఏళ్ల అశ్విన్.. జార్జియాలోని డిస్ట్రిక్ట్ 48 స్టేట్ సెనేట్ కోసం డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ స్థానానికి రిపబ్లికన్ షాన్ స్టిల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తన రాష్ట్రమైన జార్జియాకు సేవ చేయాలన్న ఉద్దేశంతో తాను సెనెట్‌కు పోటీ చేస్తున్నట్లు అశ్విన్ రామస్వామి ప్రకటించారు. తనలా రాజకీయంగా ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికీ మెరుగైన అవకాశాలు ఉండాలని ఆయన పేర్కొన్నారు.
24 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, ఎన్నికల భద్రత, టెక్నాలజీతో పాటు పలు రంగాల్లో అశ్విన్ రామస్వామి పని చేశారు. అశ్విన్ రామస్వామి ఎన్నికైతే.. కంప్యూటర్ సైన్స్‌తో పాటు న్యాయవాద డిగ్రీ కలిగి ఉన్న ఏకైక జార్జియా చట్టసభ్యుడిగా రికార్డు సృష్టిస్తారు.
Read More: కెనడాలో అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులకు శుభవార్త.. వర్క్ పర్మిట్ ప్రోగ్రాంకు కీలక మార్పులు..
ఇక.. తన తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికా వచ్చారని అశ్విన్ తెలిపారు. తాను భారత, అమెరికా సంస్కృతులతో పెరిగిగానని.. తాను హిందువునని తెలిపారు. తనకు భారతీయ సంస్కృతిపై చాలా ఆసక్తి ఉందని.. తాను కాలేజీ సమయంలో సంస్కృతం కూడా నేర్చుకున్నట్లు వెల్లడించారు. తాను ప్రతి రోజూ యోగా, ధ్యానం చేస్తూ ఉంటానని అశ్విన్ పేర్కొన్నారు. తాను కాలేజీలో ఉన్నప్పుడ సంస్కృతం చేర్చుకున్నానని తెలిపారు.అనేక పురాతన గ్రంథాలను చదివానని వివరించారు. ప్రస్తుతం ఉపనిషత్తులు చదివాలనే ఆసక్తి ఉందని తెలిపారు.
అశ్వనీ రామస్వామి ప్రముఖ స్టాన్ ఫోర్డ్ యూనివర్సీటీలో కంప్యూటర్ సైన్స్లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రభుత్వ సంస్థ సెక్యూరిటీ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్ఛర్ సెక్యూరిటీ ఏజెన్సీలో సివిల్ సర్వేంట్ గా పని చేశారు. 2020-22 మద్య స్థానిక ఎన్నికల కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు. జార్జియా అటార్నీ జనరల్స్ కాన్యూమర్ ప్రొటెక్షన్ డివిజన్ లో లీగల్ ఆఫీసర్ గా కూడా పని చేసిన అనుభవం ఉంది అశ్వినీ రామస్వామికి.