BigTV English

Bridge Collapse in America: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన!

Bridge Collapse in America: ఘోర ప్రమాదం.. నౌక ఢీకొని ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన!

Bridge Collapse


Baltimore Bridge Collapsed after Large Boat Collision: మంగళవారం తెల్లవారుజామున అగ్రరాజ్యం అమెరికారులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ భారీ నౌక ఢీకొనడంతో ఓ బ్రిడ్జ్ కుప్పకూలింది. దీంతో అందరూ చూస్తుండగానే పదల సంఖ్యలో మనుషులు, వాహనాలు నదిలో పడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. యూఎస్ లోని బాల్టిమోర్ లో ఉన్న ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఓ భారీ కంటైనర్ బోటు బ్రిడ్ ను ఢీకొట్టింది. దీంతో బ్రిడ్జ్ ఉన్నట్టుండి కూలిపోయింది. పటాపస్కో నదిపై ఉన్న బ్రిడ్జ్ ను సింగపూర్ జెండాతో ఉన్న ఆ నౌక ఢీకొట్టింది.


ఈ ప్రమాదం జరిగిన సమయంలో బ్రిడ్జ్ పైన ఉన్న దాదాపు 20 మందితో పాటుగా.. పదుల సంఖ్యలో వాహనాలు నీట మునిగినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంత మంది మరణించారనే విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Also Read: Suicide Bomb Attack: పాక్‌లో ఆత్మాహుతి దాడి.. ఐదుగురు చైనా ఇంజనీర్లు మృతి

సింగపూర్ జెండాతో ఉన్న ఆ నౌక బాల్టిమోర్ నుంచి శ్రీలంకలోని కొలంబోకు వెళ్తున్నది. ఆ నౌకను దాలి అనే పేరుతో పిలుస్తారు. అయితే ఈ దాలి అనే నౌక ఢీకొనడంతో బ్రిడ్జ్ కూలిపోవడంతో దానితో అనుసందానమైన అన్ని దారులను మూసివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్ పోర్టేషన్ అధికారులు వెల్లడించారు. రహదారుల మూసివేత కారణంగా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడినట్లు తెలిపారు. ట్రాఫిక్ ను మరో వైపు దారి మళ్లించారు. అయితే ప్రమాదం జరిగిన దృశ్యాలు దగ్గర్లోని సీసీటీవీలో రికార్డ్ అవ్వగా.. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Donald Trump: 8 యుద్ధాలు ఆపిన నాకు నోబెల్ ఇవ్వరా? పాపం, ట్రంప్ మామ బాగా హర్ట్ అయ్యాడు కాబోలు

Nobel Prize Peace: ట్రంప్‌‌కు బిగ్ షాక్.. నోబెల్ శాంతి బహుమతి ఎవరికంటే..?

Big Stories

×