Big Stories

Ester Comments on Noel: ఆరు నెలలకే విడాకులు అంటున్నారు.. నోయెల్ క్యారెక్టర్ ఏంటో తెలుసా..?

- Advertisement -

Actress Ester Noronha Sensational Comments on Ex Husband Noel: టాలీవుడ్ సింగర్ నోయెల్ సీన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ర్యాపర్ గాఎం సింగర్ గా, నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఇలా కాకుండా పెళ్లి అయిన ఆరునెలలకే విడాకులు తీసుకున్న సెలబ్రిటీగా కూడా ఫేమస్ అయ్యాడు. హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా ను 2019 లో వివాహమాడిన నోయెల్.. ఆరునెలలు కూడా నిండకుండానే విడాకులు తీసుకున్నాడు. ఇక వీరి విడాకుల రచ్చ అప్పట్లో ఏ రేంజ్ లో జరిగిందో అందరికీ తెల్సిందే. విడాకుల తరువాత ఎస్తేర్.. తన కెరీర్ ను నిరాటంకంగా కొనసాగిస్తోంది. అందాల ఆరబోతకు నో చెప్పకుండా మంచి పాత్రలను ఎంచుకొని పేరు తెచ్చుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ.. తన విడాకుల గురించి వివరిస్తూనే ఉంటుంది.

- Advertisement -

తాజాగా మరోసారి ఎస్తేర్.. నోయెల్ తో విడాకులకు గల కారణాలను చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అందరూ అనుకొనేది తప్పు అని చెప్పుకొచ్చింది. అదేంటంటే.. నోయెల్, ఎస్తేర్ ది ప్రేమ వివాహం అని అనుకుంటూ వచ్చారు. అయితే వారిది ప్రేమ వివాహం కాదని, పెద్దలు కుదిర్చిన వివాహమని చెప్పుకొచ్చింది. పెళ్ళికి ముందు నోయెల్ తో మహా అయితే నాలుగు, అయిదు సార్లు మాట్లాడినట్లు తెలిపింది. రెండు రోజులు మెసేజ్ చేసి, మూడో రోజే పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడని, తన ఇంట్లో కూడా పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో నోయెల్ గురించి ఇంట్లో చెప్పినట్లు తెలిపింది. ఇక పెళ్ళికి ముందు ఉన్న క్యారెక్టర్.. పెళ్లి తరువాత ఉండదని, తన కెరీర్ కు కూడా చాలా ప్రాబ్లెమ్ గా అనిపించి విడాకులు తీసుకున్నట్లు తెలిపింది. ఫోర్స్ బుల్ గా ఉండడం తన వాళ్ళ కాదని, ఆరు నెలలోనే విడాకులు తీసుకున్నా.. ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్లు తెలిపింది.

Also Read: Pawan Kalyan: అవే చరణ్ కు శ్రీరామరక్ష.. అబ్బాయ్ పుట్టినరోజున బాబాయ్ స్పెషల్ పోస్ట్..

“మా విడాకులు మా ఇంట్లో వాళ్లకు చాలా బాధ పెట్టాయి. చాలావరకు కలపడానికి చూసారు. కానీ, కుదరనే కుదరడం లేదు, వర్క్ అవుట్ అవ్వడం లేదు అని తెలిసి వాళ్ళు కూడా ఓకే అన్నారు.  విడిపోవడానికి ఒక్క విషయం అని చెప్పలేం. మొత్తం క్యారెక్టరైజేషన్, నేచర్. ఏదో ఒకటి చూసి జడ్జ్ చేయలేము. ఇప్పుడు నన్ను చూసి  ఒక జర్నీ స్టార్ట్ చేశారు.. కానీ, కొన్నిరోజులు అయ్యాకా.. నా ఉద్దేశ్యాలే వేరు అని తెలిసినప్పుడు నాతో ముందుకు సాగలేరు. నేను బ్యాక్ స్టెప్ వేసే మనిషిని అయితే.. నా సక్సెస్ నేను చూసుకొని.. తరువాత వాళ్ళని వదిలేస్తే.. సక్సెస్ వచ్చేవరకు మనతో ఉండి  తరువాత వెళ్ళిపోయింది అని అనుకుంటారు. పెళ్లి జరిగేవరకు నోయెల్ ఒకలా ఉన్నాడు. పెళ్లి తరువాత తన నేచర్ మారింది. నిన్నటివరకు బాగానే ఉన్నాడు. ఇప్పుడేంటి ఇలా ఉన్నాడు.. ఇలా ఎందుకు మారాడు ఇదే మైండ్ లో వస్తుంది. నా భవిష్యత్తు కు, నా ఇండివిడీజ్యువాలిటీ కి అడ్డుకట్ట వేసేలా ఉంది. మనం తగ్గి ఏదో ఒకలా ముందుకు వెళ్ళవచ్చు కానీ, అలా అయితే రోజు మనం చస్తూ ఉంటాం. ఆ ధైర్యంతోనే వాళ్ళు మాట్లాడతారు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నా పేరెంట్స్ నాకు సపోర్ట్ గా నిలబడ్డారు. నీ స్వాభిమానాని వదిలేసి,  నీ ఐడెంటిటీని వదిలేసి .. వేరేలా బ్రతకాలంటే వద్దు అని చెప్పి తీసుకొచ్చేశారు” అని చెప్పింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News