Big Stories

UNO Report: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!

UNO Report: ఐక్యరాజ్య సమితి తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఆహారం దొరకక ఏఏ దేశాలు బాధపడుతున్నాయి.. భవిష్యత్తులో ఏ ఏ దేశాలు ఈ సమస్యను ఎదుర్కోనున్నాయనేది అందులో స్పష్టంగా పేర్కొన్నది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గడిచిన సంవత్సరంలో 59 దేశాలలో ఆహార సంక్షోభం ఏర్పడిందని, ఆ దేశాల్లోని 28.2 కోట్ల మంది ప్రజలు తీవ్ర ఆకలితో సతమతమయ్యారని ఐక్యరాజ్య సమితి రిలీజ్ చేసిన నివేదికలో పేర్కొన్నది. 2022 సవంత్సరంతో పోలిస్తే 2023లో ఆహార కొరత ఎదుర్కొన్నవారి సంఖ్య 2.4 కోట్లకు పెరిగిందని తెలిపింది.

- Advertisement -

Also Read: కెన్యాలో వరద బీభత్సం..38 మంది మృతి

- Advertisement -

అంతేకాదు.. మాలి, సోమాలియా, దక్షిణ సూడాన్ తోపాటు కొన్ని దేశాల్లో ఆకలి సమస్య చాలా తీవ్రంగా ఉందంటూ ఆ నివేదికలో యూఎన్ఓ పేర్కొన్నది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా రానున్న కాలంలో గాజాలో 11 లక్షల మంది ఆహార కొరతను ఎదుర్కొంటారని, ఎల్ నినో ప్రభావం కూడా 2024లో ఆహార భద్రతపై చాలా తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొన్నది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News