BigTV English

Peru Airlines Accident : రన్‌వే‌పై ఫైర్ ట్రక్కును ఢీకొన్న విమానం..ఇద్దరు మృతి

Peru Airlines Accident : రన్‌వే‌పై ఫైర్ ట్రక్కును ఢీకొన్న విమానం..ఇద్దరు మృతి

Peru Airlines Accident : పెరూలోని లిమా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన లాటం ఎయిర్‌లైన్స్ విమానం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. అయితే ఫైర్ ట్రక్కులో ఉన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మరణించారని, మరో ఉద్యోగి గాయపడ్డాడని విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానం రన్‌వేపై ఫైర్‌ట్రక్కును ఢీకొట్టి మంటలు చెలరేగాయి.


ప్రమాదం జరిగిన ఎయిర్ బస్ ఎ 320 నియో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కుటుంబాలకు అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లో తన సంతాపాన్ని ట్వీట్‌లో తెలిపారు. విమానం లిమా నుంచి పెరువియన్ నగరమైన జూలియాకాకు వెళుతుండగా రన్ వేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం విమానాశ్రయంలో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఈ విమాన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.


Tags

Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×