E-Paper
Advertisement

Formula E Race In Hyderabad : హైదరాబాద్‌లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేస్..స్టార్ట్ అయిన ట్రయిల్ రన్స్

Formula E Race In Hyderabad : హైదరాబాద్‌లో మొదటిసారిగా ఫార్ములా ఈ రేస్..స్టార్ట్ అయిన ట్రయిల్ రన్స్
Advertisement

Formula E Race In Hyderabad : హైదరాబాద్‌లో తొలిసారి అంతర్జాతీయ స్థాయి ఫార్ములా రేస్‌కి.. టోటల్ గ్రౌండ్ సిద్ధమైంది. నేడు ఫార్ములా-ఈ రేస్‌ ట్రయల్‌ రన్‌ జరగనుంది. డిసెంబర్‌లో సెకండ్ ట్రయల్ రన్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసలు రేస్‌ ఉండనుంది. లండన్‌, ప్యారిస్‌, మొనాకో, బెర్లిన్‌ నగరాల్లోని రేస్‌ సర్క్యూట్స్‌కి ఏమాత్రం తగ్గకుండా హుస్సేన్‌ సాగర్‌ దగ్గర రేసింగ్‌ ట్రాక్‌ను సిద్ధం చేశారు. EV టెక్నాలజీపై అవగాహన పెంచడానికి ఫార్ములా-ఈ రేసింగ్‌ ఉపయోగపడుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు.

ఫార్ములా-ఈ ట్రయల్ రన్ కోసం ఇటలీ నుంచి 14మంది రేసర్లు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వాళ్లకు సంబంధించిన స్పోర్ట్స్ కార్లూ ల్యాండయ్యాయి. ఈ రేసింగ్ కార్లను ప్రత్యేకంగా దుబాయ్‌ నుంచి హెవీ డ్యూటీ కారియర్ల ద్వారా కట్టుదిట్టంగా హైదరాబాద్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేశారు. మొత్తం 11 టీమ్‌లు పాల్గొనబోయే ఈ రేస్‌లో ఒక్కో టీమ్‌లో రెండేసి కార్లు, నలుగురు డ్రైవర్లు ఉంటారు. ఇండియాకు చెందిన 10 మంది ఈ రేస్‌లో పార్టిసిపేట్ చేస్తారు.

Advertisement

రేస్ కారణంగా ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కుల్ని ఇవాళ్టి నుంచి ఈ నెల 20 వ‌ర‌కు మూసివేశారు. నవంబర్ 21వ తేదీ నుంచి య‌థావిధిగా పార్కులు తెరుచుకుంటాయి. డిసెంబర్‌లో జరిగే సెకండ్ ట్రయల్‌ రన్‌కి ముందు.. మళ్లీ ట్రాక్‌ను పునరుద్ధరిస్తారు.

అటు… రేసింగ్ పోటీల కోసం నవంబర్‌16 నుంచే ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, తెలుగుత‌ల్లి జంక్షన్ల వ‌ద్ద ట్రాఫిక్‌ను డైవర్ట్ చేశారు. వచ్చే ఫిబ్రవరిలో జరిగే ఫార్ములా ఈ ఛాంపియన్‌ షిప్‌ పోటీలతో విశ్వ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరబోతోంది.

Advertisement

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Big Stories

Advertisement
×