BigTV English

Plastic Pollution : కడలి కడుపులో ప్లాస్టిక్.. మన వాటా ఎక్కువే

Plastic Pollution : కడలి కడుపులో ప్లాస్టిక్.. మన వాటా ఎక్కువే
Plastic Pollution

Plastic Pollution : ఏటా ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు దాదాపు 430 మిలియన్ టన్నులు. మనం స్వల్పకాలం వాడి పడేసే వ్యర్థాలే ఈ మొత్తంలో 60 శాతం మేర ఉంటాయి.
వీటిలో అధిక భాగం సముద్రాల్లోకి చేరుతోంది. కాలిఫోర్నియా-హవాయి మధ్య పసిఫిక్ సముద్రంలో చేరిన ప్లాస్టిక్ వ్యర్థాలు.. ఫ్రాన్స్ విస్తీర్ణానికి మూడురెట్లు ఉంటుందట.


సుదీర్ఘ తీర ప్రాంతం, తక్కువ భౌగోళిక విస్తీర్ణం, అత్యధిక వర్షపాతం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ అరకొరగా ఉన్న దేశాల నుంచే అధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు కడలిలో కలుస్తున్నాయని ఓ సర్వే తెలిపింది. ఉదాహరణకు మలేసియాతో పోలిస్తే చైనా నుంచి ఉత్పత్తయ్యే ప్లాస్టిక్ వ్యర్థాలు పది రెట్లు ఉంటాయి.

కానీ కడలిలో చేరుతున్న ప్లాస్టిక్ వేస్ట్‌లో మలేసియా వాటా 9% అయితే.. చైనాది 0.6 శాతమే. ఇలా అత్యధిక మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లోకి చేరుస్తున్న టాప్ టెన్ దేశాల్లో ఫిలిప్పీన్స్ అగ్రభాగాన ఉంది. ఏటా 3.56 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఫిలిప్పీన్స్ నుంచి సముద్రగర్భానికి చేరుతున్నాయి.


మన దేశం రెండో స్థానంలో ఉంది. మొత్తం 1.26 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రాల్లోకి మనం చేరుస్తున్నాం. 73 వేల టన్నులతో మలేసియా, 70 వేల టన్నులతో చైనా 3, 4 స్థానాల్లో నిలిచాయి.

ఇండొనేసియా నుంచి 56 వేల టన్నులు, మయన్మార్ 40 వేలు, బ్రెజిల్ 37 వేలు, వియత్నాం 28 వేలు, బంగ్లాదేశ్ 24 వేలు, థాయ్‌లాండ్ నుంచి 22 వేల టన్నుల వ్యర్థాలు సముద్రంలోకి కలుస్తున్నాయి. మిగిలిన ప్రపంచ దేశాలన్నీ కలిపి 1.76 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను కడలిలోకి చేరుస్తున్నాయి.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×