BigTV English

Muscle Cramps : నిద్రలో కండరాలు గట్టిగా పట్టుకుంటున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఇదే..

Muscle Cramps : చాలామందికి నిద్రపోతున్న సమయంలో కండరాలు ఒక్కసారిగా పట్టేస్తాయి. ఆ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, నడుము, మెడ కింది భాగాలలో ఈ నొప్పి వస్తుంది. ఈ కండరాల నొప్పి రావడానికి వివిధ కారణాలున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, విశ్రాంత జీవనశైలి, ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఈ నొప్పి వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.

Muscle Cramps : నిద్రలో కండరాలు గట్టిగా పట్టుకుంటున్నాయా? ఈ సమస్యకు పరిష్కారం ఇదే..

Muscle Cramps : చాలామందికి నిద్రపోతున్న సమయంలో కండరాలు ఒక్కసారిగా పట్టేస్తాయి. ఆ సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. ముఖ్యంగా కాళ్లు, నడుము, మెడ కింది భాగాలలో ఈ నొప్పి వస్తుంది. ఈ కండరాల నొప్పి రావడానికి వివిధ కారణాలున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, విశ్రాంత జీవనశైలి, ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఈ నొప్పి వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు.


తీవ్రమైన నొప్పి కలిగించే కండరాల తిమ్మిరి రావడానికి కొన్నిసార్లు మందులు, అనారోగ్య సమస్యలు కూడా కారణంగా చెప్పవచ్చు. ఈ నొప్పి హానికరం కాకపోయినా ముందుజాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

కండరాల తిమ్మిర్లు చాలాసార్లు వాటంతట అవే తగ్గిపోతాయి. వైద్య చికిత్స అవసరం ఉండదు. కానీ దీని వల్ల కాలు వాపు, చర్మం రంగు మారటం, కండరాల బలహీనత కూడా వచ్చే అవకాశం ఉంది.


వీటిని నివారించడానికి శరీరాన్ని రుకుగా ఉంచుకోవాలి, నీరు ఎక్కువగా తాగాలి, ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చొని ఉండకూడదు. ఈ అలవాట్లతో పాటు ఆహారపు అలవాట్లతో కూడా ఈ నిప్పిని నివారించవచ్చు. ముఖ్యంగా పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

తీసుకోవాల్సిన ఆహారాలు :

చిలగడదుంపలు (sweet potato) : తియ్యటి బంగాళదుంపలలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల, ఇవి కండరాల తిమ్మిరి నివారణలో సహాయపడతాయి.

బచ్చలికూర (Spinach) : బచ్చలికూర మెగ్నీషియానికి మంచి మూలం, ఇది కండరాల పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది. బచ్చలికూర వంటి ఆహారాల ద్వారా తగినంత మెగ్నీషియం తీసుకోవడం కండరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కండరాల నొప్పి, తిమ్మిరిని తగ్గిస్తుంది.

ధాన్యగింజలు : మెగ్నీషియం సమృద్ధిగా ఉన్న ఆహారాలలో గింజలు , విత్తనాలు ప్రధానమైనవి. కండరాల ఆరోగ్యానికి ,కండరాల నొప్పిని తగ్గించడానికి ఇవి బాగా ఉపకరిస్తాయి. బాదం, వేరుశెనగ మరియు పొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇవి కండరాల తిమ్మిరిని నివారించడంలో సహాయపడతాయి.

అరటిపండ్లు : అందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉన్న అరిటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అరటిపండ్లు రోజూ తినడం వల్ల రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి.

నారింజ (Orange): వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కండరాల తిమ్మిరి వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇది హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. తిమ్మిరిని తగ్గించటానికి మరొక మార్గం.

సాల్మన్ చేప : ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ (కొవ్వు ఆమ్లాల) కారణంగా, సాల్మన్ కండరాల నొప్పిని నయం చేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వ్యాయామం తరువాత చాలా మంది కండరాల నొప్పి సమస్యను ఎదుర్కొంటారు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఈ అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. సమతుల్య ఆహారంలో భాగంగా సాల్మన్ చేపలు తీసుకోవటం వల్ల కండరాల నొప్పిని తగ్గించడానికి, మొత్తం కండరాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

నీరు: సరైన కండరాల పనితీరును నిర్వహించడానికి , తిమ్మిరి తగ్గించడానికి బాగా హైడ్రేటెడ్(నీరు ఎక్కువ తాగడం) గా ఉండటం చాలా అవసరం. డీహైడ్రేషన్(శరీరంలో నీరు తక్కువ) వల్ల కండరాల ఆరోగ్యానికి కీలకమైన పొటాషియం , సోడియం వంటి ఎలక్ట్రోలైట్‌లలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ ఎలక్ట్రోలైట్‌లు బ్యాలెన్స్‌లో లేనప్పుడు, కండరాల తిమ్మిరి కలుగుతుంది. అందుకే నీరు ఎక్కువగా తాగమని వైద్యులు చెబుతుంటారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×