BigTV English

PM Modi Arrives In Delhi| రష్యా, ఆస్ట్రియా పర్యటన విజయవంతం.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆ రెండు దేశాల నాయకులతో కలిసి పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆస్ట్రియా, రష్యా దేశాలతో వాణిజ్యం, టెక్నాలజీ, మిలిటరీ పరంగా భారత్ భాగస్వామ్యం దిశగా ప్రధాని మోదీ వ్యూహాత్మక చర్చలు చేశారని సమాచారం.

PM Modi Arrives In Delhi| రష్యా, ఆస్ట్రియా పర్యటన విజయవంతం.. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ

PM Modi latest news(Telugu news live today): రష్యా, ఆస్ట్రియా దేశాల పర్యటన విజయవంతంగా ముగించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. పర్యటనలో భాగంగా ఆ రెండు దేశాల నాయకులతో కలిసి పలు కీలక అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. ఆస్ట్రియా, రష్యా దేశాలతో వాణిజ్యం, టెక్నాలజీ, మిలిటరీ పరంగా భారత్ భాగస్వామ్యం దిశగా ప్రధాని మోదీ వ్యూహాత్మక చర్చలు చేశారని సమాచారం.


ఆస్ట్రియా ప్రభుత్వాన్నిప్రశంసించిన ప్రధాని మోదీ
గత 41 సంవత్సరాలలో ఆస్ట్రియా దేశాన్ని పర్యటించిన తొలి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. పర్యటన ముగిసిన తరువాత, ప్రధాని మోదీ ఆస్ట్రియా ప్రభుత్వం, ఛాన్సలర్ కార్లనెహామర్ , దేశ ప్రజల ఆతిథ్యానికి కృతజ్ఞతలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. “నా ఆస్ట్రియా పర్యటన చారిత్రాత్మకమైనది. పర్యటనలో చర్చల ద్వారా రెండు దేశాల మధ్య స్నేహానికి ఉత్సాహం మరింత పెరిగింది. వియన్నాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఛాన్సలర్ కార్లనెహామర్, ఆస్ట్రియా ప్రభుత్వం, ఆస్ట్రియా ప్రభుత్వానికి, ఆ దేశ ప్రజల ఆతిథ్యానికి నా ధన్యవాదాలు,” అని ప్రధాని ట్విట్టర్-x లో పోస్టు చేశారు.

Also Read: ‘ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడమే బెటర్’.. హలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ ప్రకటన!


ప్రధాని మోదీ పర్యటనపై ఆస్ట్రియా ఛాన్సలర్
మరోవైపు, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్లనెహామర్, ఆస్ట్రియాలో భారత ప్రధాని మోదీ ఆతిథ్య బాధ్యతలు విజయవంతంగా నిర్వహించిన బృందాలకు తన అభినందనలు తెలిపారు. ట్వట్టర్ ద్వారా నెహామర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఫెడరల్ ఆర్మీ, పోలీసులు, ప్రోటోకాల్ అధికారులు, ఇతర సహాయక సిబ్బందికి అభినందిస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్ డాలర్లు !

ఆస్ట్రియా పర్యటనకు ముందు రష్యా పర్యటించిన ప్రధాని మోదీ
ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత మాస్కోలో తన మొదటి పర్యటనలో, ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి 22వ ఇండియా-రష్యా సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. తన పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడుతూ ఉక్రెయిన్‌ వివాదానికి యుద్ధరంగంలో పరిష్కారం సాధ్యం కాదని, బాంబులు, తుపాకులు, తూటాల మధ్య శాంతి చర్చలు సఫలం కావని హితువు చెప్పారు. రష్యా పర్యటన ముగిసిన తరువాత మాస్కో నుంచి ప్రధాని మోదీ జూన్ 9 న ఆస్ట్రియాకు వెళ్లారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొల్పడానికి ఆస్ట్రియా, ఇండియా సహకరిస్తాయని ప్రకటించారు.

 

 

Related News

Donald Trump: చైనాపై సింపతీ.. ట్రంప్ ఆంతర్యం ఏంటి?

Trump – Putin: ట్రంప్ ఉండి ఉంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధమే జరిగేది కాదు.. పుతిన్ కీలక వాఖ్యలు

Trump, Putin Meeting: తగ్గేదే లే..! ట్రంప్, పుతిన్ చర్చించిన అంశాలు ఇవే..

Trump and Putin: ట్రంప్, పుతిన్ భేటీపై ఉత్కంఠ..! ఎవరి పంతం నెగ్గుతుంది..

America-Russia: అమెరికా-రష్యా చర్చలు విఫలమైతే భారత్ ని బాదేస్తాం.. తల, తోక లేని ట్రంప్ వార్నింగ్

Tsunami: నిశబ్దంగా.. 100 అడుగుల ఎత్తైన కెరటాలతో ముంచెత్తిన సునామీ, భారీ విధ్వంసం

Big Stories

×