BigTV English

Joe Biden-George Clooney| ‘ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడమే బెటర్’.. హలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ ప్రకటన!

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు సన్నిహితుడైన జార్జ్ క్లూనీ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయకూడదని ప్రముఖ వార్తా పత్రిక న్యూ యార్క టైమ్స్ లో భావోద్వేగంగా ఒక లేఖ రాశారు.

Joe Biden-George Clooney| ‘ఎన్నికల బరి నుంచి బైడెన్ తప్పుకోవడమే బెటర్’.. హలీవుడ్ సీనియర్ హీరో షాకింగ్ ప్రకటన!

Joe Biden-George Clooney(World news today) : హాలీవుడ్ సీనియర్ హీర్, ఆస్కార్ అవార్ విన్నర్ జార్జ్ క్లూనీ బుధవారం షాకింగ్ ప్రకటన చేశారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కు సన్నిహితుడైన జార్జ్ క్లూనీ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ పోటీ చేయకూడదని ప్రముఖ వార్తా పత్రిక న్యూ యార్క టైమ్స్ లో భావోద్వేగంగా ఒక లేఖ రాశారు.


బైడెన్ కు చెందిన డెమొక్రాటిక్ పార్టీకి మద్దతునిచ్చే హాలీవుడ్ ఎలైట్ సభ్యులలో క్లూనీ ఒకరు. పార్టీ కోసం ఎన్నోసార్లు నిధులు కూడా సేకరించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ గత నెలలో డిబేట్ పోటీ పాల్గొన్నారు. ఇద్దరి మధ్య జరిగిన మాటల యుద్ధంలో ట్రంప్ చేసే దాడులకు బైడెన్ ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆలోచిస్తూ నిలబడిపోయారు. 81 ఏళ్ల బైడెన్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని.. ఆయనకు మతిమరుపు వ్యాధి ఉన్నట్లు పలుమార్లు మీడియాలో వచ్చింది.

Also Read: US Police arrest for 4 Telugu people: యూఎస్, నలుగురు తెలుగువాళ్లు అరెస్ట్.. ఎందుకంటే?


డిబేట్ లో బైడెన్ ప్రవర్తన చూసి.. ఇప్పుడు ఆయనకు సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవుతోంది. దేశాన్ని మరో నాలుగేళ్లు పారిపాలన అందించగలిగే సామర్థ్యం బైడెన్ లేదనే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల బైడెన్ సొంత పార్టీకి చెందిన మహిళా సెనేటర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్.. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అన్నారు.

ఇప్పుడు నటుడు జార్జ్ క్లూనీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. క్లూనీ తను రాసిన లేఖలో.. బైడెన్ తనకు మంచి మిత్రుడని, బైడెన్ అంటే తనకు చాలా ఇష్టమని, అతని కోసం గతంలో పనిచేశానని గుర్తుకు చేశారు. కానీ అప్పటి బైడెన్ కు.. ఇప్పుడున్న బైడెన్ కు చాలా తేడా ఉందని రాశారు.

ట్రంప్ తో జరిగిన డిబేట్ లో బైడెన ప్రదర్శన పేలవంగా ఉందని చూపుతూ.. ఇక బైడెన్ తనంటే తానే తప్పుకోవడం మంచిదని భావోద్వేగంగా లేఖలో రాశారు. ఎన్నికలకు నాలుగు నెలలముందు బైడెన్ తప్పుకుంటే డెమొక్రాట్ పార్టీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడుతుందనే వాదన సరైనది కాదని కూడా క్లూనీ రాశారు. బైడెన్ స్థానంలో కొత్త అభ్యర్థి ఎవరనే అంశాన్ని ఆగస్టులో జరిగే డెమొక్రాట్ మీటింగ్ లో వైస్ ప్రెసిడెంట్ కమాలా హ్యారిస్, మేరీల్యాండ్ గవర్నర్ వెస్ మూర్, ఇతర నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

Also Read: Donald Trump: బైడెన్‌కు ట్రంప్ సవాల్.. ఆటలో గెలిస్తే మిలియన్ డాలర్లు !

మరోవైపు జో బైడెన్.. తాను అధ్యక్ష ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తానని.. తప్పుకునే ప్రసక్తే లేదని చెప్పారు.

బైడెన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వాళ్లలో చక్ షుమర్, హకీమ్ జెఫ్రీస్, నాన్సీ పెలోసి లాంటి అగ్రనాయకులతో పాటు.. డెమొక్రాట్ పార్టీకి చెందిన కొందరు సేనేటర్లు కూడా ఉన్నారు. బైడెన్ నాయకత్వంలో ఎన్నికలు ఓడిపోతామనే భయం డెమొక్రాట్ పార్టీ నాయకులలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వారంతా బైడెన్ ని తప్పకోవాలని బహిరంగంగా చెబుతున్నారు.

Tags

Related News

California: చెట్టును తాకి లైవ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్

Americal News: అమెరికాలో మళ్లీ.. ఓ పాఠశాల కాల్పుల కలకలం, ఆరుగురు మృతి

Japan Flu Outbreak: జపాన్ లో విజృంభిస్తోన్న ఫ్లూ మహమ్మారి.. 4 వేలకు పైగా కేసులు, స్కూళ్లు మూసివేత

Australia Plane Crash: ఆస్ట్రేలియాలో రన్ వే పై కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి

US Tariffs on China: మరో బాంబు పేల్చిన ట్రంప్.. చైనాపై 100 శాతం సుంకాల ప్రకటన

America: అమెరికాలో ఘోర ప్రమాదం.. 19 మంది మృతి!

Nobel Peace Prize 2025: నోబెల్ శాంతి బహుమతి ట్రంప్ నకు అంకితం.. మరియా కొరీనా కీలక ప్రకటన

Worlds Largest Cargo Plane: శంషాబాద్‌లో ప్రపంచంలోనే.. అతిపెద్ద కార్గో విమానం

Big Stories

×