BigTV English

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం.. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి

Uttarkashi: ఉత్తరకాశీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. హిమాలయాల్లో ట్రెక్కింగ్ వెళ్లిన బృందంలో నలుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని ఎగువ హిమాలయ పర్వతాల్లో సహస్త్రతల్ వద్దకు 22మందితో కూడిన బృందం ట్రెక్కింగ్‌కు వెళ్లింది. వీరిలో నలుగురు మృతి చెందగా.. ఇంకా 18 మంది హిమాలయాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5మందిని ఉత్తరాఖండ్ విపత్తు నిర్వహణ బృందాలు కాపాడాయి. మిగతా వారిని కూడా రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టింది.


ప్రతికూల వాతావరణమే కారణమా?

ట్రెక్కింగ్ బృందం గత నెల 29న 22మందితో కలిసి హిమాలయన్ వ్యై ట్రెక్కింగ్ ఏజెన్సీ వద్దకు వెళ్లారు. అయితే హిమాలయాల్లో సుమారు 4,400 మీటర్ల ఎత్తులో సహస్త్రతల్ సరస్సు ఉంది. ఇక్కడకు వెళ్లిన బృందం.. తిరుగు ప్రయాణంలో దారి తప్పారు. ఒక్కసారిగా ప్రతికూల వాతావరణం ఏర్పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విపత్తు శాఖ తెలిపింది. అయితే ఇందులో 18 మంది కర్ణాటకకు చెందిన ట్రెక్కర్లు ఉండగా.. ఒక్కరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఉన్నారు. వీరందరినీ ముగ్గురు అక్కడే ఉన్న స్థానిక గైడ్లు తీసుకెళ్లినట్లు సమాచారం. వీరంతా ఎంతసేపటికి బేస్ క్యాంపునకు చేరుకోకపోవడంతో ట్రెక్కింగ్ ఏజెన్సీ అప్రమత్తమై చర్యలు చేపట్టింది.


Also Read: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కి బిగ్ షాక్.. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత

ముమ్మరంగా గాలింపు చర్యలు

రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందడంతో హెలికాప్టర్ సహాయంతో ఎస్డీఆర్ఎఫ్ గాలిస్తున్నట్లు ఉత్తరకాశీ కలెక్టర్ తెలిపారు. ఇదే కాకుండా సహాయక చర్యల కోసం ఇండియన్ నేవీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. దారి తప్పిన వారి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపడుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. అలాగే జాడ తప్పిన ట్రెక్కింగ్ బృందం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ఏరియల్ రిస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. హెలిప్యాడ్, మట్లీ, హర్సిల్ వంటి సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి రక్షణ సిబ్బందితోపాటు వైద్య బృందం పంపించినట్లు తెలిపారు. అంతకుముందు ఉత్తరకాశీ, భట్వాడీ ఆస్పత్రులను అప్రమత్తం చేయడంతోపాటు తక్షణ వైద్యం కోసం అంబులెన్స్‌తో పాటు హెలికాప్టర్‌లను పంపినట్లు వివరించారు.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×