BigTV English

Japan: జపాన్‌లో మోదీ షో.. జీ7లో మనదే హవా..

Japan: జపాన్‌లో మోదీ షో.. జీ7లో మనదే హవా..
pm modi japan

Japan: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా ఆహ్వానం మేరకు జీ7 సదస్సుకు ప్రత్యేక అతిధిగా హాజరైన మోదీతో.. జెలెన్‌ స్కీ సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా పూర్తిస్థాయి దురాక్రమణ మొదలైన నేపథ్యంలో మోదీ, జెలెన్‌స్కీ తొలిసారి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.


మరో వైపు జీ7 సదస్సులో మరికొన్ని ఆసక్తి సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రధాని మోదీపై తన ఆప్యాయతను ప్రదర్శించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. మోదీ, బైడెన్‌ ఇద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జీ7 సదస్సు సందర్భంగా బైడెన్‌ రాకను గమనించిన మోదీ.. కుర్చీలోంచి లేచి మరీ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం జో బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. మరో వైపు ఇదే వేదికగా బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ను సైతం ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని పలకరించారు.

వివిధ దేశాధ్యక్షులు ప్రధాని మోదీని ఆలింగనం చేసుకుని పలకరించడంతో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, జర్మన్‌ ఛాన్సలర్‌ ఒలాఫ్ స్కోల్జ్ తో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. జీ7 సదస్సు కోసం ఒకరోజు ముందుగానే జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×