BigTV English

Planet Like Earth:- భూమిలాగా మరో గ్రహం.. పూర్తిగా అగ్నిపర్వతాలతో..

Planet Like Earth:- భూమిలాగా మరో గ్రహం.. పూర్తిగా అగ్నిపర్వతాలతో..

Planet Like Earth:– అసలు భూమి లాంటి గ్రహం ఇంకొకటి ఉంటుందా? అక్కడ మనుషులు జీవనం కొనసాగించే అవకాశం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కెనడాకు చెందిన ఆస్ట్రానాట్స్ చేసిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. భూమిలాంటి మరొక గ్రహం ఉందని, కాకపోతే అది పూర్తిగా అగ్నిపర్వతాలతో నిండిపోయి ఉందని వారి పరిశోధనల్లో బయటపడింది.


సోలార్ సిస్టమ్‌కు 90 లైట్ ఇయర్స్ దూరంలో ఈ కొత్త గ్రహం ఆస్ట్రానాట్స్‌కు కనిపించింది. అది పూర్తిగా అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని వారు చెప్తున్నారు. ఇది భూమి సైజ్‌లోని ఉండి, మనుషులు జీవనానికి సపోర్ట్ చేసే విధంగా ఉందని వారు తెలిపారు. కెనడా ఆస్ట్రానాట్స్ చేసిన ఈ డిస్కవరీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్ట్రానాట్స్ దృష్టిని ఆకర్షించింది. కెనడా టీమ్ ఈ గ్రహం గురించి కనిపెట్టినప్పుడు ఇప్పటివరకు ఎవరూ కనిపెట్టనిది, తాము కనిపెట్టామని తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.

మనం ఉంటున్న సోలార్ సిస్టమ్‌కు బయట ఉన్న గ్రహాలను ఎక్సోప్లానెట్స్ అని అంటారు. ఆ విధంగా చూస్తే.. ఇప్పుడు ఆస్ట్రానాట్స్ కనిపెట్టిన ఈ కొత్త గ్రహం కూడా ఒక ఎక్సోప్లానెటే. గత కొన్నేళ్లుగా మనుషుల జీవనానికి సపోర్ట్ చేసే ఎక్సోప్లానెట్స్ కోసం ఆస్ట్రానాట్స్ వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటివరకు వారు పలు ఎక్సోప్లానెట్స్‌ను కనిపెట్టినా అవి మనిషి జీవనానికి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేసే విధంగా లేవన్నారు. కానీ ఇప్పుడు కనిపెట్టిన ఈ కొత్త ఎక్సోప్లానెట్ కేవలం భూమి సైజ్‌లో ఉండడం మాత్రమే కాకుండా ఇక్కడ లాగానే ఉష్ణోగ్రతలు కలిగి ఉందని వారు చెప్తున్నారు.


ప్రస్తుతం కెనడా ఆస్ట్రానాట్స్ కనిపెట్టిన ఈ గ్రహానికి నాసా ‘టెస్’ అనే పేరుపెట్టింది. అంటే ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ అని అర్థం. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా దీని గురించి తగిన సమాచారాన్ని కనుక్కునే విషయంలో ఆస్ట్రానాట్స్ నిమగ్నమయి ఉన్నారు. ఇప్పటివరకు కేవలం నాసా ఆస్ట్రానాట్స్ మాత్రమే కొత్త కొత్త ప్రయోగాలను చేయగలరు అనుకుంటున్న ప్రజలకు కెనడా ఆస్ట్రానాట్స్ వారి సత్తాను చూపించారని నిపుణులు ప్రశంసిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×