BigTV English
Advertisement

Lahore Book Fair: బుక్ ఫెయిర్‌లో కరువైన పుస్తక ప్రియులు.. అమ్ముడుపోయిన 35 పుస్తకాలు, 800 బిర్యానీలు!

Lahore Book Fair: బుక్ ఫెయిర్‌లో కరువైన పుస్తక ప్రియులు.. అమ్ముడుపోయిన 35 పుస్తకాలు, 800 బిర్యానీలు!

Lahore Book Fair| పుస్తకాలు చదివే అలవాటు ఉంటే వ్యక్తిత్వం మెరుగవుతుంది, మంచి అలవాట్లు పెంపొందించుకుంటారని చాలాసార్లు వింటూ ఉంటాం. కానీ ఈ కాలంలో పుస్తకాలు చదివే వారే తక్కువ. అందరూ ఇంటర్నెట్ లో వెబ్ సైట్స్, ఆన్ లైన్ లైబర్రీ, ఆడియో బుక్స్ కు అలవాటు పడ్డారు. అయినా కొంతమంది మాత్రం పాత పద్ధతిలో పుస్తకాలు చదివేందుకే ఇష్టపడతారు. అలాంటి వారి కోసం అడపాదడపా పుస్తక ప్రదర్శనలు జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ నగరంలో కూడా ప్రతీ సంవత్సరం జాతీయ పుస్తక ప్రదర్శనతోపాటు పలు బుక్ ఫెయిర్స్ జరుగుతూ ఉంటాయి.


అలాంటిదే ఒక పుస్తక ప్రదర్శన పాకిస్తాన్ లోని ప్రధాన నగరం లాహోర్‌లో జరిగింది. కానీ పుస్తక ప్రదర్శనకు వచ్చినవారు పుస్తకాల కంటే అక్కడ లభించే తిండిపై మక్కువ చూపించారు.

వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ లోని రెండో అతిపెద్ద నగరం లాహోర్‌లో పుస్తక ప్రియులు, సాహిత్య అభిమానుల కోసం ఒక బుక్ ఫెయిర్ జరిగింది. లాహోర్ లోని కల్చరల్ అండ్ లిటరరీ సెంటర్ ఆఫ్ పాకిస్తాన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఉర్దూ భాష సాహిత్యకారులు ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాదత్ హసన్ మాంటో లాంటి వారి పుస్తకాలు ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమం దారుణంగా ఫెయిల్ అయిందని చెప్పాలి.


ఎందుకంటే పుస్తకాలు చూడడానికి వచ్చినవారు.. తమ మనుసు మార్చుకొని తిండిపోతులుగా మారిపోయారు. పుస్తకాలను పట్టించుకోకుండా అక్కడ లభించే చికెన్ సాండ్ విచ్, షవర్మ, బిర్యానీపై ఆసక్తి చూపించారు. స్థానిక మీడియా సంస్థ ఏషియా న్యూస్ నెట్‌వర్క్ కథనం ప్రకారం.. లాహోర్ లో జరిగిన బుక్ ఫెయిర్‌లో కేవలం 35 పుస్తకాలు మాత్రమే విక్రయించబడ్డాయి. కానీ పుస్తక ప్రదర్శన సమీపంలో ఫుడ్ స్టాల్స్ వ్యాపారం ధూమ ధామ్‌గా జరిగింది.

Also Read: విచిత్ర వివాహం.. 70 ఏళ్ల ముసలాడితో 25 ఏళ్ల యువతి పెళ్లి.. ఎలా కుదిరిందంటే?

పుడ్ స్టాల్స్ లో దాదాపు 800 ప్లేట్ల బిర్యానీ అమ్ముడు పోయిందట. బిర్యానీ ప్లేట్ల సంఖ్య అటంచితే.. 1200 షవర్మాలు, 1500కు పైగా చికెన్ సాండ్ విచ్ లు అమ్ముడుపోయాయట. ఆన్ లైన్ ఈ వార్తలకు సోషల్ మీడియాలో విపరీతమైన పోస్ట్‌లు కామెంట్లు వస్తున్నాయి.

ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో ఈ పుస్తక ప్రదర్శన గురించి ఎక్కువ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఒక యూజర్ అయితే.. ”ఈ పుస్తక ప్రదర్శన.. లాహోర్ నగర పతనానికి ఉదాహరణ అని, దేశ ప్రజలు చాలా సిగ్గుపడాల్సిన విషయం అని అభివర్ణించాడు. ఇంకొక నెటిజెన్ కామెంట్ చేస్తూ.. ”పాకిస్తాన్ లో అసలు పుస్తకాలు సంస్కృతి లేదు. అయినా అలాంటి చోటుకి వెళ్లి తిండిపై మరీ ఈ స్థాయిలో ఆసక్తి చూపిస్తారా?” అని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

అయితే చాలా మంది యూజర్లు దీనికి ముఖ్య కారణం ఇదేనని ఓ విషయం తెలిపాడు. పుస్తక ప్రదర్శన్ ఒక్కో పుస్తకం ఖరీదు రూ.400 నుంచి రూ.500 దాకా ఉందని.. నవలా పుస్తకాలు అయితే రూ.3000కు పైగా ధర ఉందని తెలిపారు. అదే ఒక బిర్యానీ ధర రూ.400 కంటే తక్కువేనని రాశారు. పాకిస్తాన్ అతిపెద్ద నగరం కరాచీలో అయితే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయని.. దీనికి కారణం అక్కడ పుస్తక ధరలు చాలా తక్కువని చెప్పారు. ఒకవేళ సాహిత్య పుస్తకాలు కావాలంటే అవి సగం ధరకే పాత పుస్తకాలు లభిస్తున్నాయని రాశారు.

Related News

United States: డయాబెటిస్‌, ఒబెసిటీ ఉంటే.. అమెరికా వీసా కష్టమే!

Crime News: 10 మంది రోగులను చంపేసిన నర్స్.. కావాలనే అలా చేశాడట, ఎందుకంటే?

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Big Stories

×