Earth Quakes Hit Cuba: క్యూబాను భారీ భూకంపం వణికించింది. దీని ధాటికి మంజినిల్లో, శాంటియాగో ప్రాంతాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు అయ్యింది. బార్టోలోమోకు 40 కిలోమీటర్ల దూరంలో 13 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు.
కరేబియన్ ద్వీప దేశం క్యూబా ఆదివారం వణికింది. క్యూబా సౌత్ ప్రాంతంలో రెండు శక్తివంతమైన భూకంపాలు వణికించాయి. గన్మా ప్రావిన్స్‌లోని బార్టోలోమ్ మాసో తీరానికి 25 మైళ్ల దూరంలో ప్రకంపనలు నమోదు అయినట్టు గుర్తించారు.
తొలి భూకంపం వచ్చిన గంట తర్వాత మరొకటి సంభవించింది. అక్కడి ప్రభుత్వ వర్గాల ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి మరణాలు నమోదు కాలేదని, దీని గురించి మరింత సమాచారం తెలియాల్సి వుందన్నారు. భూప్రకంపనలు బలంగా రావడంతో ప్రజలు వీధుల్లోకి వచ్చారు. భారీ ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి.
చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదన్నది యూఎస్ సునామీ హెచ్చరిక సంస్థ మాట. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
ALSO READ: దీపావళి వేడుకల్లో మందు. మాంసం.. ఏకంగా ప్రధానికే తప్పని తిప్పలు
ఇటీవల వచ్చిన రాఫెల్ హరికేన్ నుండి కోలుకుంటున్న సమయంలో ప్రకంపనలు ఆ ద్వీపాన్ని వణికించాయి, నివాసితులకు రెండు రోజుల పాటు విద్యుత్ లేదు. దీనికితోడు భూకంపం రావడంతో ఎప్పుడు ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు. గతేడాది అక్టోబర్‌లో క్యూబాను వణికించింది భూకంపం. రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు అయ్యింది.
🇨🇺 Images of the aftermath of the earthquakes in Cuba
Damage is reported in several buildings in the municipality of Bartolomé Masó
Footage from social media#Cuba #earthquake pic.twitter.com/4PQPdB0X6q
— Shubham Kumar (@shubhamViral) November 10, 2024