Indian Railways: పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. యూపీఐ వ్యాలెట్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది తమ జేబులలో డబ్బులు తీసుకెళ్లడమే మానేశారు. ఐదు, పది రూపాయలకు కూడా ఆన్ లైన్ పేమెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సంస్థలు ఈ వ్యాలెట్స్ ను అందుబాటులోకి తెచ్చాయి. నిత్యం లక్షలాది మంది రైల్వే ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకునే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కూడా IRCTC eWalletని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడం వల్ల వినియోగదారులకు బోలెడు లాభాలున్నాయి.
IRCTC eWalletతో చాలా ఉపయోగాలు
IRCTC eWalletలో టిక్కెట్ చెల్లింపుకు గేట్ వే ఛార్జీలు ఉండవు. ఆన్ లైన్ వాలెట్ టాప్-అప్, నిర్దిష్ట బ్యాంక్ నెట్ వర్క్ పై ఆధారపడి ఉండదు. టిక్కెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఈజీగా రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఈ వాలెట్ చెల్లింపు వివరాలను తనిఖీ చేసుకునే అవకాశం ఉంది. తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం కూడా IRCTC eWalletని ఉపయోగించవచ్చు. IRCTC కూడా eWalletతో చాలా లాభాలున్నట్లు వెల్లడించింది. IRCTC లావాదేవీలకు సంబంధించి పాస్‌వర్డ్, లేదంటే PIN నంబర్‌ను జారీ చేస్తుంది. IRCTC eWallet ద్వారా ప్రతి బుకింగ్‌కు ముందు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ, మీ బ్యాంకు సర్వర్ పని చేయకపోతే IRCTC eWallet ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్వే eWallet లో రూ. 100 నుంచి రూ. 1000 వరకు జమ చేసుకోవచ్చు.
IRCTC eWalletని ఎలా ఉపయోగించాలి?
❂ముందుగా https://www.irctc.co.in వెబ్ సైట్ ను ఓపెన్ చేసి లాగిన్ చేయాలి.
❂ IRCTCని మొదటిసారి ఉపయోగిస్తున్నట్లైతు మీ అకౌంట్ ను క్రియేట్ చేసుకోవాలి.
❂ ‘IRCTC ఎక్స్ క్లూజివ్’ బటన్ కింద ఉన్న ‘IRCTC eWallet’పై క్లిక్ చేయాలి.
❂ మీ IRCTC అకౌంట్ లోకి IRCTC లావాదేవీ పాస్ వర్డ్ ను ఎంటర్ చేయాలి.
❂ మీ లావాదేవీ పాస్ వర్డ్ ని నమోదు చేసిన తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
❂ ఆ తర్వాత, మీరు IRCTC హోమ్ పేజీకి వెళ్తారు.
❂ ఇప్పుడు, మీరు మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ చేయాలి.
❂ ‘IRCTC ఎక్స్ క్లూజివ్’ ట్యాబ్ ను క్లిక్ చేసి, దానిని eWallet లో వివరాలను నమోదు చేయాలి.
❂ ‘IRCTC eWallet డిపాజిట్’పై క్లిక్ చేసి, UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నుంచి డబ్బులు పంపించుకోవచ్చు.
❂ ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత IRCTC వెబ్‌సైట్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
IRCTC eWalletతో ప్రయోజనాలు
⦿ సురక్షిత లావాదేవీలు: IRCTC eWallet సురక్షితమైన లావాదేవీలను అందిస్తుంది.
⦿ ఈజీ టిక్కెట్ బుకింగ్స్: IRCTC eWallet చెల్లింపుతో టికెట్ బుకింగ్ ఈజీగా ఉంటుంది. టైమ్ సేవ్ అవుతుంది.
⦿ నో గేట్ వే ఛార్జీలు: IRCTC eWalletతో టికెట్ బుక్ చేసుకుంటే గేట్ వే ఛార్జీలు ఉండవు.
⦿ ఆన్‌లైన్ వాలెట్ టాప్-అప్: మీరు మీ IRCTC eWalletని ఆన్ లైన్‌లో టాప్ అప్ చేసుకోవచ్చు.
⦿ బ్యాంక్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు: మీ బ్యాంకు సర్వర్ డౌన్ అయిన సమయంలో ఈజీగా IRCTC eWallet ఉపయోగించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
⦿ ఈజీగా రీఫండ్: మీరు టిక్కెట్‌ను రద్దు చేస్తే సులభంగా రీఫండ్ ను క్లెయిమ్ చేసుకోవచ్చు.
⦿ ఈజీగా తత్కాల్ టిక్కెట్ల బుకింగ్: ఈజీగా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC eWalletని ఉపయోగించవచ్చు.
⦿ రైలు టిక్కెట్లతో పాటు మరియు విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి IRCTC eWalletని ఉపయోగించవచ్చు.