Big Stories

Pakistan Results : పాకిస్థాన్ లో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ.. దేశాన్ని ఏలేదెవరు ?

Pakistan Election Results(Today news paper telugu): పాకిస్థాన్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో హంగ్‌తో ఆ దేశాన్ని ఏలేదెవరు..? ప్రధాని కాబోయేదెవరన్న దానిపై పాకిస్తానీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

పాకిస్తాన్‌ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్తాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీకి అత్యధికంగా 97 సీట్లు వచ్చాయి. దేశ ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాల ప్రకారం మరో మాజీ పీఎం నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌కి 71 స్థానాల్లో విజయం సాధించగా.. బిలావల్‌ భుట్టో సారథ్యంలోని పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టికి 53 సీట్లు వచ్చాయి. ఇతర పార్టీలు 27 స్థానాలను కైవసం చేసుకున్నాయి.

- Advertisement -

Read More : ఇండో-పసిఫిక్‌లో మాల్దీవులు భాగస్వామి దేశం.. అమెరికా కీలక ప్రకటన..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే పాకిస్తాన్‌ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు గాను 133 స్థానాలను గెలుపొంది తీరాలి. అయితే.. అభ్యర్థి మరణించడంతో ఒక స్థానానికి ఎన్నికలు వాయిదా పడ్డాయి. మహిళలు, మైనారిటీలకు రిజర్వ్ చేసిన స్లాట్‌లతో సహా మొత్తం 336 సీట్లలో సాధారణ మెజారిటీని సాధించడానికి 169 సీట్లు అవసరం కాగా.. ఏ పార్టీకి మెజారిటీ మార్కు రాకపోవడంతో పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్‌ నెలకొంది.

ఇక ప్రభుత్వ ఏర్పాటుపై వ్యూహాలను రచిస్తున్నారు పార్టీ నేతలు. ఈమేరకు నజాజ్‌ షరీఫ్‌ సంకీర్ణ ప్రభుత్వానికి పిలుపునివ్వగా.. నాల్గవసారి పీఎం కావాలనుకున్న షరీఫ్‌ బిలావల్‌ భుట్టో జర్దారీతో కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం పలు పార్టీలకు పిలుపునిచ్చారు షరీఫ్‌. మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాలో ఉన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News