BigTV English

Gift to Trump: ట్రంప్‌కు ఫ్రీగా లగ్జరీ విమానం.. గొడవేంటి? కిటుకేంటి?

Gift to Trump: ట్రంప్‌కు ఫ్రీగా లగ్జరీ విమానం.. గొడవేంటి? కిటుకేంటి?

Gift to Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రూటే సపరేట్ అంటున్నారు. ఆయన ఇప్పుడు ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఖతార్ రాజకుటుంబం నుంచి బోయింగ్ 747 విమానాన్ని ఆయన గిఫ్ట్‌గా తీసుకున్నారు. దీనిపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా కానీ ఎక్కడా తగ్గడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. అంత ఖరీదైన విమానాన్ని ఇస్తుంటే.. వద్దని చెప్పడానికి నేనేమైనా వెర్రివాడనా అంటూ.. ట్రంప్ ఎదురు ప్రశ్నిస్తున్నారు.


89 సీట్లతో ఉన్న ఈ విమానం.. ఫ్రెంచి ఇంటీరియర్‌ డిజైన్‌తో రూపొందించారు. నిజానికి ఈ విమానం ఎగిరే రాజభవనం అని చెప్పవచ్చు. కానీ అమెరికా అధ్యక్షుడు ఈ విమానంలో ప్రయాణించాలంటే చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానాన్ని ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా పిలుస్తారు. ఇది ఎంత విలాసంగా ఉంటుందో.. అంతకు మించిన హైటెక్‌ భద్రత ఏర్పాట్లు ఉంటాయి.

కానీ ఖతార్ నుంచి గిఫ్ట్‌గా తీసుకున్న ఈ విమానంలో అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఇప్పుడు వాటన్నింటిని అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికా నిఘా సంస్థలు, సీక్రెట్ సర్వీస్‌కు కొత్త తలనొప్పిగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇందులో ఎలాంటి నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారనే అనుమానం ఉంటుందని చెబుతున్నారు. అమెరికానే ఇలాంటి విమానాన్ని ఇతర దేశాలకు గిఫ్ట్‌గా ఇవ్వాల్సి ఉంటే.. ఖచ్చితంగా నిఘా పరికరాలను అమరుస్తుందని చెబుతున్నారు అమెరికా రక్షణరంగ నిపుణులు. మరి అమెరికాకు ఇచ్చే వాటిలో ఉండవని గ్యారెంటీ ఏంటనేది వారి ప్రశ్న. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ రిలీజ్ చేశారు. ఆ విమానాన్ని ప్రభుత్వం కొత్త బోయింగ్ విమానాలు వచ్చేవరకు.. తాత్కాలిక ఎయిర్ ఫోర్స్ వన్‌గా వాడుతుంది. నూతన విమానాల డెలివరీలు చాలా ఆలస్యమవుతున్నాయి అని పేర్కొన్నారు.


నిజానికి ట్రంప్ తన ఫస్ట్‌ టర్మ్‌లోనే కొత్త ఎయిర్‌ఫోర్స్‌ విమానాలకు ఆర్డర్ ఇచ్చారు. వీటి విలువ 3.9 బిలియన్ డాలర్లు. కానీ వాటి డెలివరీలో ఆలస్యం అవుతుండటం ఇప్పుడు ట్రంప్ కోపానికి కారణమవుతోంది. అదే విషయాన్ని చెబుతున్నారు. మనకు ఉచితంగా వచ్చినదాన్ని తీసుకుంటే తప్పేంటన్నది ట్రంప్ ప్రశ్న.

Also Read:  పేర్లు మారితే నిజాలు మారవ్.. చైనాపై భారత్ సీరియస్

కానీ ఎయిర్‌ఫోర్స్ అనేది గాల్లో ఎగిరే ఓ శత్రుదుర్భేద్యమైన కోట లాంటిది. దాడులు, పేలుళ్లను తట్టుకొనే ఏర్పాట్లు దాని సొంతం. అంతేకాదు సీక్రెట్ కమ్యూనికేషన్ వ్యవస్థ.. ఎయిర్ రీఫ్యూయలింగ్‌, ఆయుధ వ్యవస్థలు ఉంటాయి. అంతేకాదు ఇప్పుడు దీనిని అణువణువు తనిఖీ చేయాలి. ఇవన్నీ చేయడానికి కొత్త దానిని తయారు చేయడానికి పట్టేంత సమయం పడుతుందని ఇప్పుడు డిఫెన్స్‌ ఎక్స్‌పర్ట్స్ మాట.

ఓ దేశం అమెరికాకు ఇంత ఖరీదైన గిఫ్ట్ ఇస్తుందంటే.. దానికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తుంది అనేది మరో విమర్శ. కానీ ట్రంప్ దీనిని కూడా విమర్శిస్తున్నారు. అలాంటిదేం జరగదంటున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×