India vs China: పాకిస్థాన్‌తో చైనా తోక కూడా వంకరే. ఇది ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయ్యింది కూడా. ఇప్పుడు మరోసారి తమ బుద్ది ఏం మారలేదని ప్రూవ్ చేసుకోంది డ్రాగన్ కంట్రీ చైనా. మరోసారి అరుణాచల్ ప్రదేశ్ తనదే అంటూ చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఈసారి ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జంగ్నాన్‌గా వ్యవహరిస్తూ.. టిబెట్ దక్షిణ ప్రాంతం అని తన మ్యాప్‌లో చూపించింది. కానీ విదేశాంగశాఖ ఈసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. పేర్లు మార్చుకున్నంత మాత్రానా.. నిజాలు మారుతాయా? అంటూ కౌంటర్ ఇచ్చింది.
చైనా మరోసారి తన తీరును మార్చుకోవడం లేదని.. మరోసారి తనవి కాని ప్రాంతాలకు పేర్లు పెట్టే బుద్ధి పోనిచ్చుకోలేదంటూ విదేశాంగశాఖ తెలిపింది. ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని సూచించింది. క్రియేటివ్‌గా పేర్లు పెట్టినంత మాత్రానా.. అరుణాచల్ వారి సొంతమై పోదని.. అరుణాచల్ ప్రదేశ్ అనేది మొదటి నుంచి భారత్‌లో అంతర్భాగంగానే ఉందని.. ఇకపై కూడా ఉంటుందని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండదని తేల్చి చెప్పింది.
2024లో అరుణాచల్ ప్రదేశ్‌ను తమ ప్రాంతంగా చెబుతూ.. అందులోని 30 ప్రాంతాలకు కొత్త పేర్లు సూచించింది. అరుణాచల్ ప్రదేశ్‌పైనే ఇరు దేశాల మధ్య చాలా ఏళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇప్పటికే టిబెట్‌ను తనలో కలిపేసుకున్న చైనా.. దాని సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ కూడా టిబెట్‌లో అంతర్భాగమనే వాదన వినిపిస్తూ వస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు కేంద్రం డ్రాగన్ కంట్రీకి కౌంటర్లు ఇస్తూ వస్తోంది.
2017 నుంచి ఈ పేర్లు మార్చే పనులను ప్రారంభించింది చైనా. మొదట అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాలకు పేర్లు మార్చింది.. 2021లో 15 ప్రాంతాల పేర్లు మార్చింది. 2023లో మరో 11 ప్రాంతాల పేర్లు మార్చింది. 2024లో ఏకంగా 30 ప్రాంతాల పేర్లు మార్చింది. ఇందులో 12 మౌంటేన్ ఏరియాలు ఉండగా.. నాలుగు నదులు, ఒక సరస్సు, 11 నివాస ప్రాంతాలు ఉన్నాయి.
పాకిస్థాన్ తానా అంటే.. చైనా తందానా అనడం ఇప్పుడు కామన్‌గా మారిపోయింది. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇటీవల మాట్లాడినప్పుడు.. న్యూక్లియర్ శక్తి ఉన్న దేశాల బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.
Also Read: సింధు జలాలపై ఆంక్షలు కొనసాగితే కాల్పుల విరమణ కొనసాగదు.. పాక్ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అదంపూర్ ఎయిర్‌బేస్‌లో పర్యటించిన సమయంలో ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు అటు పాకిస్థాన్‌తో పాటు.. ఇటు చైనాకు కూడా వార్నింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. భారత్ జోలికి వస్తే.. ఎవరినైనా మట్టికరిపిస్తామని చెబుతున్నారు ప్రధాని మోడీ.