Virat Kohli – Rohit Sharma: టీమిండియా సార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మకు అదిరిపోయే శుభవార్త చెప్పింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టెస్టులకు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ లకు ఎవరికి ఇవ్వని బంపర్ ఆఫర్ ఇచ్చింది. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా టెస్టులు, టి20 మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. వాళ్ల కాంట్రాక్ట్ విషయంలో.. వెనక్కి తగ్గడం లేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఎప్పటిలాగే ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు A ప్లస్… కాంట్రాక్టు కొనసాగుతుందని తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవజిత్ ప్రకటన చేశారు.
ALSO READ: MI’s 4th IPL Title: కాలుకు 7 కుట్లు..రక్తం కారుతోంది..అయినా ముంబైపై వాట్సన్ వీరోచిత బ్యాటింగ్
ఆ ఇద్దరు క్రికెటర్లు టీమిండియాలోనే భాగమై ఉన్నారని.. అందుకే ఏ ప్లస్ సౌకర్యాలు గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా లభిస్తాయని బీసీసీఐ సెకరెటరీ దేవజిత్.. స్పష్టం చేయడం జరిగింది. వాస్తవానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి రూల్స్ ప్రకారం… మూడు ఫార్మాట్లు.. అంటే టెస్టు, వన్డేలు, టి20 లు ఇలా మూడు ఆడితేనే.. A ప్లస్ గ్రేడ్ వర్తిస్తుంది. కానీ స్పెషల్ గా విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మలు మాత్రం ఒకే ఒక ఫార్మాట్ లో ప్రస్తుతం ఆడుతున్నారు. అది కూడా 50-50 ఓవర్స్ వన్డే మ్యాచ్ లు. టి20 లో అలాగే టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించారు ఈ ఇద్దరు క్రికెటర్లు. కానీ వాళ్లు గతంలో టీమిండియాకు అందించిన సేవలను గుర్తుపెట్టుకున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి.. ఇప్పటివరకు ఎవరికి ఇవ్వని సదుపాయాలను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి సెక్రటరీ దేవజిత్ వెల్లడించారు. ఈ లెక్కన ఇకపై కూడా ఏ ప్లస్ కాంట్రాక్టు ఇద్దరు క్రికెటర్లకు కొనసాగుతుంది.
A+ గ్రేడ్ క్రికెటర్లకు ఎంత జీతం ?
2024-25 BCCI సెంట్రల్ కాంట్రాక్టులలో, A+ గ్రేడ్ క్రికెటర్లు సంవత్సరానికి ₹7 కోట్ల జీతం పొందుతారు. ఈ అగ్ర శ్రేణిలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్ళు ఉన్నారు.
14 ఏళ్ల క్రికెట్ కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్
14 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడిన విరాట్ కోహ్లీ రెండు రోజుల కిందట రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏజ్ పై పడడం, యంగ్ స్టార్లకు అవకాశం ఇచ్చేందుకుగాను… విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. దీంతో ఇకపై కేవలం వన్డే మ్యాచులు మాత్రమే రోహిత్ శర్మ తరహాలోనే విరాట్ కోహ్లీ ఆడబోతున్నాడు. మహా అయితే 2027 వరకు మాత్రమే ఈ ఇద్దరు అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వన్డే మ్యాచ్లకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తారు.