BigTV English

Rare Bird : ఈ పక్షి సగం ఆడ, సగం మగ.. ఎలా జన్మించిందో తెలిస్తే..!

Rare Bird : ఈ పక్షి సగం ఆడ, సగం మగ.. ఎలా జన్మించిందో తెలిస్తే..!
This image has an empty alt attribute; its file name is 95d00385ee8c0e99d5ff80c506ce93d0.jpg

Rare Bird : మనుషుల పుట్టుక, శరీర లక్షణాలను బట్టి జెండర్‌ను విభజిస్తారు. కొందరు పురుషులకు మహిళల లక్షణాలు ఉంటే మరి కొందరు మహిళలు పురుషులుగా జీవించాలనుకుంటారు. ఇలాంటి లక్షణాలు మనుషుల్లోనే కాదు. ఇప్పుడు పక్షుల్లో కూడా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అటువంటి ఓ పక్షే కొలంబియా అడవుల్లో కనిపించింది. సగం మగ, సగం ఆడ జాతి లక్షణాలు ఉండే గ్రీన్ హనీక్రీపర్ పక్షి (Green honeycreeper) కెమెరాకు చిక్కింది. ఈ పక్షి శరీరంలో ఒక భాగంలో మగ నీలిరంగు ఈకలు. రెండవ భాగంలో ఆకుపచ్చ రంగులో ఉన్న ఆడ ఈకలు ఉంటాయి.


ఈ పక్షుల్లో మగవాటికి తల నల్లగా, ఈకలు నీలిరంగులో ఉంటాయి. ఆడజాతి పక్షుల ఈకలు ఆకుపచ్చగా ఉంటాయి. కానీ తాజాగా గుర్తించిన పక్షిలో రెండు రకాలు ఉన్నాయి. డివిజన్ బైలేటరల్ గైనాండ్రోమోర్ఫిజం వల్ల పక్షికి ఈ మిక్సిడ్ కలర్ ఏర్పడింది. పక్షుల్లో లింగ నిర్థారణ వాటి క్రోమోజోమ్‌లతో ముడిపడి ఉంటుంది. ఆడ పక్షులు సాధారణంగా ఒక జత W,Z సెక్స్ క్రోమోజోమ్‌లను కలిగి ఉంటాయి. మగ పక్షులు Z క్రోమోజోమ్‌లను మాత్రమే కలిగి ఉంటాయి.

పక్షి పునరుత్పత్తి ప్రక్రియలో రెండు కేంద్రాలతో గుడ్డును ఉత్పత్తి చేస్తే బైలేటరల్ గైనండ్రోమోర్ఫిజం తల్లెత్తుతుంది. ఒక కేంద్రం Z క్రోమోజోమ్ కలిగి ఉంటే మరొకటి W క్రోమోజోమ్ కలిగి ఉంటుంది. ఈ సాధారణ గుడ్డు రెండు వేర్వేరు స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం జరిగినప్పుడు రెండు క్రోమోజోమ్‌లను కలిగి ఉంటుంది. దీని వల్ల డబుల్ ఫెర్టిలైజేషన్ జరగవచ్చు.


ఇలా జరిగినప్పుడు అభివృద్ధి చెందుతున్న పక్షి మగ, ఆడ లక్షణాలను ప్రదర్శిస్తుంది. WZ కణాల స్త్రీ లక్షణాలుగా అభివృద్ధి చెందగా.. ZZ కణాల పురుష లక్షణాలుగా అభివృద్ది చెందుతాయి. ఇలాంటప్పుడు శరీరం ఇరువైపులా మగ, ఆడ లక్షణాలతో జన్మిస్తుంది. ఈ లక్షణాలతో పక్షి జన్మించడం వందేళ్ల తర్వాత జరిగింది. పక్షులలో ఇలా జరగడం చాలా అరుదు. చాలా మంది పక్షి పరిశీలకులు జీవితాంతం ప్రయత్నించినా ఏ పక్షిలోనూ బైలేటరల్ గైనండ్రోమోర్ఫిజం లక్షణాలు చూడలేక పోయారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×