Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇంట్లో చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ దొంగతనంపై హీరో కేసు నమోదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేధించారు. ఈ మేరకు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేసి, డైమండ్ రింగ్ తో పాటు పలు విలువైన వస్తువులను వారి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
డైమండ్ రింగ్ దొంగలు దొరికారోచ్
విశ్వక్ సేన్ ఇంట్లో డైమండ్ రింగ్ దొంగతనం కేసులో ముగ్గురు దొంగలను ఫిలిం నగర్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి రెండు డైమండ్ రింగ్స్, ఎలక్ట్రిక్ బైక్, 3 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మార్చ్ 14 న తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిలిం నగర్ పోలీసులకు విశ్వక్ సేన్ తండ్రి సి. రాజు కంప్లయింట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఫిలిం నగర్ పోలీసులు రోజుల వ్యవధిలోనే దొంగలను పట్టుకోవడం విశేషం.
సిసి కెమెరాలు, దొంగిలించిన ఇయర్ బడ్స్ లొకేషన్ ఆధారంగా దొంగలను ట్రేస్ చేసిన పోలీసులు డైమండ్ రింగ్స్, మిగతా వస్తువులను ఆ దొంగలు షేక్ పేట నాలా వద్ద విక్రయిస్తుండగా అరెస్టు చేశారు. ఆ దొంగలను భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లుగా గుర్తించిన పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. వారి వద్ద నుండి రెండు డైమండ్ రింగ్స్, 1 ఎలక్ట్రిక్ బైక్, 3 మొబైల్ ఫోన్స్, 1 ఇయర్ బర్డ్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఓటీటీలోనూ తప్పని ‘లైలా’ తిప్పలు
ఇదిలా ఉండగా, ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘లైలా’ మూవీ మంచి బజ్ తో రిలీజ్ అయింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ మూవీ అంచనాలను అందుకోలేకపోయింది. విమర్శకుల నుంచి ఈ మూవీకి తీవ్రమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయిన మూడు వారాల్లోనే ‘లైలా’ ఓటీటీలోకి అడుగు పెట్టింది. ముందుగా ఈ మూవీ మార్చ్ 7న ఆహాలో ప్రీమియర్ కావాల్సి ఉంది. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ కాస్త లేట్ అయ్యి, ఫైనల్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అయ్యింది. మార్చ్ 9 నుంచి అందుబాటులోకి వచ్చింది. రామ్ నారాయణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, విశ్వక్ సేన్ ఫస్ట్ టైం ఈ మూవీలో లేడీ గెటప్ లో నటించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయగా, లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ‘లైలా’కు ఓటీటీలో కూడా ట్రోలింగ్ తప్పలేదు. ఇక ఈ మూవీ రిలీజ్ కు ముందే పెద్ద వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రి పృథ్వీ రాజ్ చేసిన 11 కామెంట్ కాంట్రవర్సి అయ్యింది. తరువాత హీరో విశ్వక్ సేన్ తో సహా అందరూ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.