BigTV English

Rupert Murdoch: 92 ఏళ్ల వయస్సులో బిలియనీర్ ఐదో పెళ్లి.. ముసలి మన్మథుడు

Rupert Murdoch: 92 ఏళ్ల వయస్సులో బిలియనీర్ ఐదో పెళ్లి.. ముసలి మన్మథుడు

Rupert Murdoch: అతనికి 92 ఏళ్లు. ప్రపంచ అత్యంత సంపన్నుల్లో ఒకరు. పేరుప్రఖ్యాతలు, ఆస్తులు, ఆంతస్థులు బాగానే సంపాదించాడు. అయితే ఇప్పుడు 92 ఏళ్ల వయస్సులో ఐదో పెళ్లికి రెడీ అయిపోయాడు. గతంలో నలుగురిని వివాహమాడి వారికి విడాకులు ఇచ్చాడు. గతేడాది ఆగష్టులోనే తన నాలుగవ భార్య నుంచి విడిపోయాడు. అది జరిగిన ఏడు నెలలకే మళ్లీ పెళ్లికి రెడీ అయిపోయాడు.


అతనే మీడియా మెఘల్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్. తన ప్రియురాలు ఆన్ లెస్టీ స్మిత్‌‌ను ఐదో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. మార్చి 17న న్యూయార్క్‌లోని ఓ హోటల్‌లో వారి ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మళ్లీ ప్రేమలో పడ్డాను. ఇదే నా చివరి వివాహం అవుతుందని నాకు తెలుసు’’ అని రూపర్ట్ మర్దోక్ వెల్లడించారు.

మార్దోక్ వెండీ డెంగ్‌ను మొదటిసారి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అన్నా మరియా మన్, పాట్రిషియా బుకర్‌లను నాలుగోసారి అమెరికన్ నటి, మోడల్ జెర్రీ హాల్‌ను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం పెళ్లి చేసుకోబోయే ఆన్ లెస్లీ స్మిత్ భర్త 13 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఆన్ లెస్లీకి మర్దోక్ దగ్గరయ్యారు. త్వరలో వీరి వివాహం జరగనుంది.


Related News

Donald Trump: ట్రంప్ మామకు దిమ్మతిరిగే న్యూస్.. బాయ్‌కట్ అమెరికా ప్రొడెక్ట్స్ ట్రెండింగ్

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Big Stories

×