BigTV English

OTT Movie : డాన్స్ చేస్తూ పగ తీర్చుకునే దయ్యం…. పిచ్చెక్కించే ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : డాన్స్ చేస్తూ పగ తీర్చుకునే దయ్యం…. పిచ్చెక్కించే ఇండోనేషియన్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఇంట్లో వాళ్లకి ఎవరైనా భయపడతారో లేదో కానీ హర్రర్ సినిమాలు అంటే ఖచ్చితంగా భయపడతారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఈమధ్య హారర్ సినిమాల హడావిడి కొనసాగుతుంది. అయితే వీటిలో ఇండోనేషియన్ నుంచి వచ్చే హర్రర్ థ్రిల్లర్ సినిమాలు భయంకరంగా ఉంటాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక హారర్ థ్రిల్లర్ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. మంచి కధతో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఇప్పుడు మనం చెప్పుకోబోయే హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రాంగ్గింగ్ కెమటియన్‘ (Ronggeng Kematian). నలుగురు స్నేహితులు వాళ్లు చేసిన పాపాలకి, దయ్యం చేతులో చిక్కుకొని, ఆ దయ్యం ప్రతీకారం తీర్చుకునే కథతో స్టోరీ నడుస్తుంది. వెన్నులో వణుకు పుట్టించే సన్నివేశాలతో ఈ మూవీ అదరగొడుతోంది. ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

సులస్త్రి ఒక మంచి క్లాసిక్ డాన్సర్. ఈమె గత కొన్ని రోజులుగా కనిపించకుండా ఉంటుంది. ఎవరితోనో వెళ్ళిపోయిందని కొంతమంది అనుకుంటారు. అయితే ఆ ఊర్లోనే ఉండే హీరోయిన్ ను ఆమె తల్లి, సులస్త్రి నేర్చుకున్న డాన్స్ ను నేర్చుకోమని ఒత్తిడి తెస్తుంది. అయితే ఆ డాన్స్ హీరోయిన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించదు. ఒకరోజు చీకట్లో హీరోయిన్ వెళుతుండగా ఆమెకు సులస్త్రి చున్నీ దొరుకుతుంది. ఇంట్లో ఆ చున్నీ వేసుకున్న తరువాత హీరోయిన్ క్లాసికల్ డాన్స్ ఇరగదీస్తుంది. ఈ డాన్స్ చూసిన హీరోయిన్ తల్లి, సులస్త్రి వాళ్ళ అమ్మ దగ్గర డాన్స్ నేర్పించడానికి తీసుకు వెళుతుంది. అయితే హీరోయిన్ మొదట డాన్స్ సరిగ్గా వేయలేదు. చున్ని వేసుకున్న తర్వాత డాన్స్ బాగా వేస్తుంది. ఆ చున్ని చూసిన తర్వాత అది తన కూతురిదని గ్రహిస్తుంది సులస్త్రి తల్లి.

ఆ తర్వాత ఆ ఊరిలో ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేసిన నలుగురు వ్యక్తులను అభినందించడానికి పిలుస్తారు ఆ ఊరి పెద్దలు. ఆ ఊరికి వచ్చిన నలుగురు వ్యక్తులను ఒక ఆకారం భయపెడుతూ ఉంటుంది. నిజానికి సులస్త్రీని  ఆ నలుగురు వ్యక్తులు చంపి ఉంటారు. వాళ్ల ద్వారా నిజం చెప్పించాలని సన్మానం పేరుతో ఆ ఊరికి రప్పిస్తారు ఆ ఊరి పెద్దలు. దయ్యం ఆకారంలో వచ్చిన సులస్త్రి వీరిని చాలా భయంకరంగా భయపెడుతుంది. చివరికి ఆ ఊరి పెద్దల దగ్గర వీళ్ళు నిజం ఒప్పుకుంటారా? సులస్త్రి చేతిలో బలైపోతారా? సులస్త్రి నీ వీళ్ళు ఎందుకు చంపారు? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘రాంగ్గింగ్ కెమటియన్’ (Ronggeng Kematian) సినిమాని మిస్ కాకుండా చూడండి. ఈ ఇండోనేషియన్  మూవీ ఒంటరిగా మాత్రం అస్సలు చూడకండి.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×