Trump Elon Musk H 1B Visa| అగ్రరాజ్యం అమెరికాలో మరో నెల రోజుల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయి. జనవరి 25, 2024న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకరం చేయబోతున్నారు. ఆయన పదవి చేపట్టగనే హెచ్ వన్‌బి వీసా నిబంధనలు కఠినతరం చేస్తారని, అక్రమ వలసదారులకు కష్టాలు తప్పవని అందరూ భావిస్తున్నారు. అయితే ట్రంప్ ఎన్నికల్లో గెలవడానికి అందరి కంటే ఎక్కువగా శ్రమించిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ మాత్రం హెచ్ వన్‌బి వీసా నిబంధనల విషయంలో ట్రంప్ తో విభేదిస్తున్నట్లు సమాచారం.
ఇటీవలే ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సృష్టించిన ఎలన్ మస్క్ హెచ్ వన్‌బి వీసాల విషయంలో యథావిధిగానే నియమాలు కొనసాగించాలని ట్రంప్ బృందానికి సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ కు చెందిన టెస్లా, స్పేస్ ఎక్స్ కంపెనీల్లో ఎక్కువగా ఈ హెచ్ వన్‌బి వీసా కలిగిన వారే ఉన్నారని.. అందుకే మస్క్ హెచ్ వన్‌బి వీసాలను కఠినతరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని నిపుణలు అభిప్రాయపడుతున్నారు.
ట్రంప్ ప్రభుత్వంలో అన్ని విభాగాల పనితీరుని పర్యవేక్షించి పైగా కొన్ని దశాబ్దాల క్రితం అమెరికాలో ఎలన్ మస్క్ కూడా అక్రమంగా ప్రవేశించి.. పనిచేశారని.. అందువల్లే ఆయన వలస వచ్చిన వారిలో నైపుణ్యం కలిగిన వారికి అండగా నిలబడే అవకాశముందని చెబుతున్నారు.
అయితే మరోవైపు ట్రంప్ దీనికి పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్నారు. ఆయన అధికారంలోకి రాగానే హెచ్ వన్‌బి వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు తప్పకుండా తీసుకునే అవకాశం ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన గతంలో అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2020 సంవత్సరంలో అమెరికాకు వలస వచ్చే వారిపై ఆంక్షలు విధించారు. హెచ్ వన్‌బి వీసాల జారీ చేయకుండా ఆపేశారు. హెచ్ వన్‌బి వీసాల కలిగి ఉన్నా.. అమెరికాలో ప్రవేశించడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. కోవిడ్ వల్ల అమెరికా ఆర్థిక సంక్షోభంలో నెల కొందని.. ఈ ఆంక్షలతో అమెరికా పౌరులకు ఉద్యోగాలు లభిస్తాయని ఆయన తన నిర్ణయాలను సమర్థించుకున్నారు.
Also Read: అమెరికా నుంచి డిపోర్ట్ కాబోతున్న18000 మంది భారతీయులు.. ట్రంప్ దెబ్బ
హెచ్ వన్‌బి వీసాలపై ఆంక్షలు విధించడం పూర్తి అమెరికా ప్రెసిడెంట్ అధికారంలో లేకపోయినా ట్రంప్ ఇలాంటి ఆదేశాలు జారీ చేయగా.. ఆ సమయంలో ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పుడు ట్రంప్ మరోసారి అధ్యక్ష పదవి చేపడితే.. హెచ్ వన్‌బి వీసాల కష్టాలు తప్పవని… ట్రంప్ నిర్ణయాలతో ఎక్కువగా భారతీయులే నష్టపోతారని గ్లోబర్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా సిటిజెన్‌షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ డేటా ప్రకారం.. దేశంలో హెచ్ వన్‌బి వీసా కలిగిన ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీల్లో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా 25వ స్థానంలో ఉంది. అమెరికాలో మొత్తం 5,80,000 మంది హెచ్ వన్‌బి వీసా హోల్డర్లు ఉన్నారని 2019 డేటా చూస్తే తెలుస్తోంది.
అమెరికా ప్రభుత్వం ప్రతీత సంవత్సరం 65,000 హెచ్ వన్‌బి వీసాలు జారీ చేస్తుంది. వీటికి అదనంగా అడ్వాన్స్‌డ్ డిగ్రీ కలిగిన వారి కోసం మరో 20,000 హెచ్ వన్‌బి వీసాలు ఇచ్చే అవకాశముంది.
కానీ ట్రంప్ పక్కనే ఉండి ఈ విధానాలను ఎలన్ మస్క్ వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి. మస్క్ కు చెందని ఈవి వాహనాల తయారీ కంపెనీ టెస్లాలో మొత్తం 1,787 మంది హెచ్ వన్‌బి వీసాల కలిగిన వారున్నారు. ఏదేమైనా మరో నెల రోజుల తరువాత మస్క్, ట్రంప్‌ల మధ్య జరిగే హెచ్ వన్‌బి వీసాల గొడవ ప్రపంచం ముందుకు రానుంది.