Big Stories

KKR Won the Match against LSG: చెలరేగిన సాల్ట్.. కోల్‌కతా ఘనవిజయం..

IPL 2024 Kolkata Knight Riders Won the Match Against Lucknow Super Giants: ఐపీఎల్ లో కోల్ కతా దూకుడు మామూలుగా లేదు. ఒకరి తర్వాత ఒకరు అందుకుంటున్నారు. ఈరోజు లక్నోతో జరిగిన మ్యాచ్ లో కోల్ కతా ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఇరగదీసి 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడమే కాదు, మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించాడు.

- Advertisement -

టాస్ గెలిచిన కోల్ కతా ముందు బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ చేసిన లఖ్ నవ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కోల్ కతా 15.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ప్రారంభంలోనే ఓపెనర్ డికాక్ (10) వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన దీపక్ హుడా (8) వెంటనే పెవిలియన్ చేరడంతో బాధ్యత ఓపెనర్ రాహుల్ (39) పై పడింది. తను కొంతవరకు పోరాడి 78 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు.

Also Read: Ruturaj Gaikwad: ఐపీఎల్ వీరుడు రుతురాజ్.. తొలి భారత బ్యాటర్‌గా రికార్డు..

కెప్టెన్ అవుట్ అయిన తర్వాత వచ్చిన ఆయుష్ బదానీ (29), మార్కస్ స్టోనిస్ (10) తక్కువ కి అవుట్ కావడంతో స్కోరు పెంచే బాధ్యతను నికోలస్ పూరన్ పై పడింది. తను 32 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 45 పరుగులు చేసి పోరాడే స్కోరు తీసుకొచ్చాడు. చివర్లో కృనాల్ పాండ్యా (7), అర్షాద్ ఖాన్ (5) నాటౌట్ గా నిలిచారు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.

తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు బ్యాటింగ్ కి దిగిన కోల్ కతా ఆడుతూ పాడుతూ అలవోకగా ఛేదించింది. ముఖ్యంగా ఓపెనర్ ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడాడు. 47 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read: Preity Zinta: రోహిత్ కోసం ఉన్నదంతా ఇచ్చేస్తా: ప్రీతి జింతా

మరో ఓపెనర్ సునీల్ నరైన్ (6), అంగ్ క్రిష్ రఘువంశీ (7) తక్కువ స్కోరుకే అవుట్ అయినా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బాధ్యతాయుతంగా ఆడాడు. 38 బంతుల్లో 38 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుని సాల్ట్ తో కలిసి విజయ పథంలో నడిపించాడు.

ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ పట్టికలో 2వ స్థానానికి కోల్ కతా ఎగబాకింది. లక్నో 5వ స్థానానికి పడిపోయింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News