BigTV English

Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన ముస్లిం దేశాలు.. 5000 మంది యాచకుల బహిష్కరణ

Pakistan: పాకిస్తాన్ పరువు తీసిన ముస్లిం దేశాలు..  5000 మంది యాచకుల బహిష్కరణ

Pakistan: ముస్లిం దేశాల నుంచి పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగలింది. ఆ దేశానికి చెందిన వేలాది మంది యాచకులను సౌదీ సహా పలు దేశాలు బలవంతంగా పంపించాయి. ఈ వ్యవహారంతో పాకిస్థాన్‌కి ఉన్నపరువు కాస్త బజారున పడింది. ఆర్థిక దుస్థితి, అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న దాయాది దేశానికి ఈ వ్యవహారం మరింత తలవంపులు తెచ్చింది.


జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహసిన్ నక్వీ వాటిని వివరించారు. కేవలం 16 నెలల కాలంలో సౌదీ అరేబియా 5,033 మంది పాకిస్థానీ యాచకులను గుర్తించి పంపింది. వారిని దేశం నుంచి బహిష్కరించినట్లు స్వయంగా వెల్లడించారు. వీరితో పాటు మరో ఐదు దేశాల నుంచి 369 మంది యాచకులను వెనక్కి వచ్చినట్టు చెప్పుకొచ్చారు.

ఓవరాల్‌గా పరిశీలిస్తే 5,402 మంది పాకిస్థానీయులు యాచకులను స్వదేశానికి తిప్పి పంపారని దాయాది దేశం అధికారిక లెక్క.  ఈ వృత్తిలోకి వచ్చినవారు అత్యధికంగా సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారు. దాదాపు 2,795 మంది ఉన్నారు. పంజాబ్ నుంచి 1,437 మంది, ఖైబర్ పఖ్తుంఖ్వా నుంచి 1,002 మంది ఉన్నారు.


అలాగే బలూచిస్థాన్ నుంచి 125 మంది, పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి 33 మంది, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నట్లు సభలో వివరించారు మంత్రి. సౌదీ తర్వాత ఇరాక్ నుంచి అత్యధికంగా 247 మంది యాచకులను వెనక్కి పంపించింది. ఇక మలేషియా, ఒమన్, ఖతార్, యూఏఈ వంటి దేశాలు కూడా యాచకుల పట్ల కఠినంగా వ్యవహరించాయి కూడా.

ALSO READ: ట్రంప్ కు దెయ్యాలతో స్వాగతం.. ఉలిక్కిపడిన అధ్యక్షుడు

యూఏఈ 58 మందిని బహిష్కరించడమే కాకుండా, దాయాది దేశానికి పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఈ చర్య పాకిస్థాన్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. యాచకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ నుంచి సౌదీ అరేబియా, UAE, కువైట్ వంటి దేశాలకు వలస వెళ్లిన పాకిస్థానీ యాచకుల పునరావాసం, వారి జీవన విధానాలు, అక్కడి ప్రభుత్వాలకు ఎదురయ్యే సమస్యలు పెద్ద చర్చకు దారి తీశాయి.

పాకిస్థాన్‌లో పేదరికం అధికంగా ఉండటం, నిరుద్యోగం వంటి కారణాలతో అనేక మంది ఇతర దేశాలకు వెళ్తున్నారు. అక్కడ యాచక వృత్తిని కొనసాగిస్తున్నారు. వలస వెళ్లిన పాకిస్థానీలు తమ మనోభావాలు, సంప్రదాయాలు, జీవన శైలిని మార్చడంలో విఫలమవుతున్నారు. వీరి ప్రవర్తన కారణంగా ముస్లిం దేశాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇస్లామాబాద్ పాలకులు దీనిపై దృష్టి సారించి పేదరికానికి, నిరుద్యోగానికి, వలసదారులకు సరిచేసే విధానాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆదేశంలో జరుగుతున్న పరిణామాలు పాకిస్థాన్ అంతర్జాతీయ ప్రతిష్ఠను మరింత దిగజార్చుతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×