BigTV English

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

Hotel Bill Con couple: 5 స్టార్ రెస్టారెంట్‌లో తినడం.. బిల్లు ఎగ్గొటి పారిపోవడం.. దంపతులకు ఇదే పని!

Hotel Bill Con couple| చాలామందికి కష్టపడి శ్రమించి జీవించిడం ఇష్టముండదు. అంతా ఫ్రీగా వచ్చేయాలని కోరుకుంటుంటారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడతారు. డబ్బులున్నంత కాలం పనిజరిగిపోతుంది. కానీ జేబు ఖాళీ అయ్యాక.. అలాంటివారికి అసలు కష్టాలు మొదలవుతాయి. ఇంతకాలం విలాసాలకు అలవాటు పడినవారు ఒక్కసారిగా కష్టపడాలంటే వారికి మనసు అంగీకరించదు. అందుకే దొంగతనాలు చేయడం, మోసాలు చేయడం వంటివి చేయడానికి పూనుకుంటారు. తెలివితేటలన్నీ తప్పుడు మార్గంలో ఉపయోగిస్తారు.
అలాంటి ఒక భార్యభర్తల జోడీ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఈ దంపతులకు బయట హోటల్స్‌లో తినడం, తాగడం ఎంజాయ్ చేయడమంటే చాలా ఇష్టం.. కానీ ఆ ఖర్చులకు తగ్గట్టు వారి వద్ద డబ్బులు లేవు. దీంతో వీరిద్దరూ జెంటిల్ మెన్ మోసగాళ్ల అవతారం ఎత్తారు.


వివరాల్లోకి వెళితే.. తాజాగా స్కాట్ ల్యాండ్ లోని ఈస్ట్ కిల్ బ్రైడ్ పట్టణంలో ‘లా డోల్స్ వీటా’ అనే రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ కు అక్టోబర్ 20న ఇద్దరు భార్యభర్తలు వచ్చారు. వాళ్ల బట్టలు, భాష, వ్యవహారం చూస్తే.. మంచి చదువుకున్నవారిలా కనిపిస్తున్నారు. దీంతో వారికి హోటల్ సిబ్బంది సపర మర్యాదలన్నీ చేశారు. ఇద్దరూ రెస్టారెంట్ సర్వీస్ ఏమంత బాగోలేదని వెయిటర్లక చెప్పారు. దీంతో వారికి స్పెషల్ సర్వీస్ ఇవ్వాలని మేనేజర్ చెప్పాడు.

Also Read: రూ.60 లక్షలు ఇస్తే.. సినిమాల్లో హీరోయిన్ చాన్స్ అంటూ యువతిపై అత్యాచారం, దోపిడి


ఇద్దరూ కలిసి రెండు స్టార్టర్లు, మూడు మెయిన్ కోర్సులు, రెండు డెసర్ట్ స్వీట్ డిష్ లు ఆర్డర్ చేసి బాగా మెక్కారు. భోజనం బాగా తిని.. కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. హోటల్ సిబ్బంది వారికి ఇంకేమైనా కావాలా? అని అడిగారు. దాంతో వారిద్దరూ.. “లేదు.. కాస్త సిగరెట్ స్మోక్ చేయాలి? ఎటువైపు వెళ్లాలి?” అని అడిగారు. ఆ రెస్టారెంట్ లో స్మోకింగ్ కు అనుమతి లేదు. దీంతో వారిద్దరూ బయటికి వెళ్లాలని హోటల్ సిబ్బంది సూచించారు. అయితే సిగరెట్ తాగి తిరిగి వస్తామని చెప్పి.. ఇద్దరూ బయటికి వెళ్లారు. కానీ మహిళ పర్సు మాత్రం టేబుల్ పైనే పెట్టి వెళ్లింది. బయట కాసేపు ఇద్దరూ స్మోక్ చేస్తూ.. మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలో ముందుగా భర్త అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాసేపు తరువాత అతని భార్య కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

చాలాసేపు ఎదురు చూసిన తరువాత హోటల్ సిబ్బందికి వారిద్దరూ తిరిగిరాలేదని.. కానీ వాళ్ల పర్సు మాత్రం ఇక్కడే ఉందని మేనేజర్ కు చెప్పారు. దీంతో మేనేజర్ కు అనుమానం కలిగింది. అతను ముందుగా బయటికి వెళ్లి హోటల్ పరిసరాల్లో వారికోసం వెతికాడు. ఎక్కడా వారిద్దరూ కనిపించలేదు. దీంతో తిరిగివచ్చి.. పర్సు తెరిచి చూస్తే.. లోపల అంతా ఖాళీ. దీంతో ఆ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు హోటల్ లోని సిసిటీవిలో సిగరెట్ తాగుతున్న వీడియో కూడా చూపించాడు. వారిద్దరూ తిన్న భోజనాలకు 80 పౌండ్లు (దాదాపు రూ.8726) అయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పోలీసులు వారిద్దరి గురించి విచారణ చేస్తే.. ఆ భర్త పేరు బెర్నార్డ్ మెక్ డొనా(41), భార్య యాన్ మెక్‌డొనా (39) అని తెలిసింది. వారిద్దరూ ఇలా చాలా కాలంగా చేస్తున్నారని.. షాపింగ్ కు వెళ్లి ఖరీదైన బట్టలు దొంగలించడం, పెద్ద రెస్టారెంట్ లో భోజనం చేయడం, 5 స్టార్ హోటల్స్ లో లగ్జరీ రూమ్స్ లో వారాల తరబడి ఉండి.. లక్షల బిల్లు ఎగ్గొటి పారిపోవడం చేశారని తెలిసింది. గతంలో ఇద్దరూ ఇలాంటి నేరాలు చేసి కొంతకాలం జైల్లో శిక్ష కూడా అనుభవించారట. ఒక సారి అయితే తమ వెంట పిల్లాడిని తీసుకెళ్లి.. అంతా బాగా తిని ఎంజాయ్ చేసి.. బిల్ కౌంటర్ వద్ద ఆ పిల్లాడిని నిలబెట్టి పారిపోయేవారు. తీరా చూస్తే.. ఆ పిల్లాడిని వారు ఏదో ఆశచూపి.. అక్కడికి తీసుకొని వచ్చారని తెలిసింది. మొత్తానికి టక్కరి దంపతులు అలా జీవితాన్ని లాగించేస్తున్నారు. ప్రస్తుతానికి పరారీలో ఉన్న వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related News

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

Big Stories

×