BigTV English

World Laughter Day 2024 : నవ్వుతూ బతకేయాలిరా తమ్ముడూ.. నేడు అంతర్జాతీయ లాఫింగ్ డే

World Laughter Day 2024 : నవ్వుతూ బతకేయాలిరా తమ్ముడూ.. నేడు అంతర్జాతీయ లాఫింగ్ డే

The History of World Laughter Day: జీవకోటి నుంచి మానవులను వేరు చేసేవి ఎమోషన్స్ అందులో ఒకటి నవ్వు. బుజ్జాయి పుట్టగానే తనకు అందరూ నేర్పే తొలి విద్య నవ్వించడమే.. అవును ఊయలలో ఉన్న బుజ్జాయిని నవ్వించడానికి కొత్త శబ్దాలు, పద ప్రయోగాలు చేస్తుంటాం. అంతేకాదు ఎప్పుడు నవ్వుతూ ఉండేవారిని అందరూ ఇష్టపడుతుంటారు. అంతేకాదండీ పక్కవారిని ఎప్పుడు నవ్వించేవారిని కూడా చాలా మందిని ఇష్టపడుతుంటారు. నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక వరం.. నవ్వలేకపోవడం ఒక రోగం. అవును నవ్వడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అసలు నవ్వకుండా మనిషి ఉండలేరా? అని సందేహం వచ్చే ఉంటుంది.


రోజంతా ఆఫీస్ లో ఒత్తిడికి లోనైనవారు ఇంటికి వెళ్లేటప్పుడు ప్రయాణంలో సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ఏదైన కామెడీ షోకి సంబంధించిన ఇన్ స్టా రీల్స్, యూట్యూబ్ షాట్స్ వచ్చినప్పుడు ఒక్కసారి నవ్వి ఉపశమనం పొందుతారు. ఈరోజు అంతర్జాతీయ లాఫింగ్ డే సందర్భంగా నవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. చిన్నపిల్లలు మాట్లాడుకుంటే భలే ఉంటుంది. ఇద్దరు గడుగ్గాయిలు మాట్లాడుకోవడం విన్నామంటే పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం. ఓ గడుగ్గాయి పక్కనే ఉన్న మరొకడికి ఇలాచెప్పాడు. చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. తెలుసా? రెండో వాడు అడిగాడు అవునా.. ఎందుకు? వెంటనే మొదటి వ్యక్తి సీరియస్ గా ఇలా చెప్పాడు. ఎందుకేంట్రా.. చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలు పెడుతుంది. దాంతో కడుపులో చక్కిలిగిలి పుడుతుంది.

Also Read: ఆస్ట్రేలియా మహిళా ఎంపీపై లైంగిక దాడి


నిజమే కదా చిన్నారులు వారికీ తెలిసీ తెలియక చెప్పే మాటలు మనకి రిలీఫ్ ని ఇస్తాయి. మన చుట్టూ కూడా పిల్లలు ఆడుకునేటప్పుడు ఎన్నో మాట్లాడుకుంటారు. కుదిరితే పిల్లలతో స్నేహం చేసి ఆడుకోవడానికి ప్రయత్నించండి. సైన్స్ ప్రకారం మనకంటే చిన్న వారిని పరిచయం చేసుకోవడం వల్ల మన తర్వాత జనరేషన్ గురించి కూడా తెలుసుకోవచ్చు. వారితో కలిసిపోయి ఆడుకొని చూడండి. వారి మాటలు, చేష్టలు అన్ని నవ్వు తెప్పిస్తాయి. కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి.

లాఫింగ్ డే ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా!

మానసిక ఒత్తిడి తగ్గించి ఆయుష్షును పెంచేదే నవ్వు. అందుకే ప్రతి ఒక్కరు రోజులో కనీసం అరగంట అయిన నవ్వకపోతే అనారోగ్యానికి గురువుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 1998 నుంచి ప్రపంచ నవ్వుల దినోత్సవం జరుపుతున్నారు. మొదట్లో నవ్వుల దినోత్సవాన్ని జనవరి రెండోవారం జరుపుకునేవారు. కాని జనవరిలో చలి ఎక్కువగా ఉంటుందని హాస్య ప్రియుల కోరిక మేరకు దాన్ని మే మొదటి ఆదివారానికి మార్చారు. ముంబైలోని డా. మదన్ కటారియా 1998లో ఈ ప్రపంచ నవ్వుల దినోత్సవాన్ని జరిపారు. నవ్వుల యోగా ఉద్యమాన్ని నవ్వు వల్ల మనిషి హావాభావాల్లో వచ్చే మార్పును, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియజేయటానికి ఈ రోజును ప్రారంభించారు. ఇందుకోసం భారతదేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా 6వేలకు పైగా లాఫింగ్ క్లబ్స్ ఉన్నాయి. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. జీవితంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడం, మారుతున్న జీవనశైలి, ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిడి కారణంగా లాఫింగ్ క్లబ్ లు , అందులో చేరే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ఇవి తెలుసా!

ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన, ఎవ్వరితోనైనా మాట్లాడగలిగే భాష నవ్వే.

గిలిగింతలకీ, జోక్స్ వేసినప్పుడే కాదు, నైట్రస్ ఆక్సైడ్ పీల్చినప్పుడు, కొన్ని మాదక ద్రవ్యాలు వాడినప్పుడు కూడా బిగ్గరగా నవ్వుతారు. అందుకే నైట్రస్ ఆక్సైడ్ ని నవ్వుల వాయువు అని పిలుస్తారు.

మనషులే కాదు. కుక్కులు, కోతులు, గొరిల్లాల వంటి జంతువులు నవ్వుతూ ఉంటాయి.

ఎవ్వరూ నవ్విన మనల్ని చూసే నవ్వుతున్నారని బాధపడటం రుగ్మత. దీన్ని “జెలటో ఫోబియా” అంటారు.

1950లో ప్రజలు రోజుకి సుమారు 18 మిముషాల పాటు నవ్వేవారు. ప్రస్తుతం ఆ సమయం 4-6 నిముషాలకు పడిపోయిందట.

నవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

మీరు గమనిస్తే చార్లీ చాప్లిన్, మిస్టర్ జీన్ వంటి వారికి హేటర్స్ అసలు ఉండరు. స్టాండప్ కామెడీయన్స్ ని వ్యతిరేకించేవారు తక్కువమంది ఉంటారు.

కల్మషం లేకుండా నవ్వడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంగతుంది.

నవ్వితే మీ పొత్తి కడుపు, ముఖంలోని కండరాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది.

15 నిమిషాల నవ్వు రెండుగంటల నిద్రతో సమానం. రోజుకు 15 సెకన్లు నవ్వతే ఆయుష్షు మరో రెండురోజులు పెరిగినట్లే.

నవ్వితే రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టీ సెల్స్ వృద్ది చెందుతాయట.

ప్రతిరోజు నవ్వడానికి కొంతసమయం కేటాయించండి. స్నేహితులతో జోక్స్ వేయండి ఆరోగ్యంగా ఉండండి.

 

Related News

California Murder: అమెరికాలో లైంగిక నేరస్థుడిని హత్య చేసిన భారతీయుడు.. వెబ్ సైట్ లో వెతికి, మారువేషంలో గాలించి మరీ

Netflix: H1-B వీసా ఫీజు పెంపుని సమర్థించిన నెట్ ఫ్లిక్స్ అధినేత..

Larry Ellison: నా ఆస్తుల్లో 95 శాతం పంచేస్తా.. ప్రపంచంలోనే సెకండ్ రిచెస్ట్ పర్సన్ ల్యారీ ఎల్లిసన్ కీలక ప్రకటన

Donald Trump: ఏడు నెలల్లో ఏడు యుద్ధాలు ఆపాను.. అందులో భారత్- పాక్ ఒకటి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Hanuman Statue: హనుమంతుడి విగ్రహంపై ట్రంప్ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు.. అమెరికా క్రైస్తవ దేశమా?

Afghan Boy: షిద్ధత్ సినిమా సీన్ రిపీట్.. విమానం ల్యాండింగ్ గేర్‌లో దాక్కుని ఢిల్లీకి చేరిన అఫ్ఘాన్ బాలుడు

Ragasa Coming: భయంతో వణికిపోతున్న చైనా.. బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా ముంచుకొస్తున్న ముప్పు

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Big Stories

×