BigTV English

Cheetah: భారత్‌కు వందకుపైగా దక్షిణాఫ్రికా చీతాలు

Cheetah: భారత్‌కు వందకుపైగా దక్షిణాఫ్రికా చీతాలు

Cheetah: భారత్‌లో చీతాలు అంతరించిపోయి దాదాపు పదేళ్లు అవుతోంది. అయితే వాటిని మళ్లీ పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో పోయిన ఏడాది నమీబియా నుంచి ఎనిమిది చీతాలను భారత్‌కు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ బర్త్ డే సందర్భంగా నమీబియా నుంచి తీసుకొచ్చి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలారు. ఇప్పుడిప్పుడే ఆ చీతాలు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడిపోతున్నాయి.


ప్రపంచంలోనే అత్యధికంగా చీతాలు కలిగిన దేశాల్లో ఒకటి దక్షిణాఫ్రికా. తాజాగా భారత్‌కు 100పైగా చీతాలను అందించేందుకు దక్షిణాఫ్రికా ముందుకొచ్చింది. రానున్న పదేళ్లలో 100కు పైగా చీతాలను అందించేలా దక్షిణాఫ్రికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి ఏటా 12 చీతాల చొప్పున రానున్న 8 నుంచి 10 ఏళ్లు పంపిచనుంది.

మొదటి విడుదతలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 12 చీతాలను భారత్‌కు పంపించనున్నట్లు దక్షిణాఫ్రికా ప్రకటించింది. ఈ చీతాలను కూడా మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.


Tags

Related News

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

America News: ఎయిర్‌పోర్టులో ఢీ కొన్న విమానాలు, ఎలా జరిగింది? వైరల్ అవుతున్న వీడియో

Philippines: చిగురుటాకులా వణికిన ఫిలిప్పీన్స్‌.. వరుసగా మూడు భూకంపాలు, 22 మంది మృతి

USA: అమెరికాలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా..

Indonesia News: ఇండోనేషియాలో కూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

Myanmar: మయన్మార్‌లో భూకంపం.. 4.7గా నమోదు, భారత్‌లోనూ ప్రకంపనలు

London News: గాంధీ విగ్రహంపై పిచ్చి రాతలు.. లండన్‌లో వెర్రి చేష్టలు, వెనుకున్నదెవరు?

Lawrence Bishnoi Gang: లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ చుట్టూ ఉచ్చు.. కెనడా సంచలనం నిర్ణయం

Big Stories

×