E-Paper
Advertisement

Chaturveda Havanam:చతుర్వేద హవనం ఫలితం దక్కాలంటే….

Chaturveda Havanam:చతుర్వేద హవనం ఫలితం దక్కాలంటే….
Advertisement

Chaturveda Havanam:విశాఖలో ఈ నెల 27 నుంచి ఐదు రోజులపాటు చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం టీటీడీ హిందూ ధ‌ర్మప్రచార ప‌రిష‌త్‌, శ్రీ‌ వేంక‌టేశ్వర ఉన్నత వేదాధ్యయ‌న సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతుంది. పెందుర్తిలో ఉన్న శ్రీశార‌దా పీఠంలో చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వహిస్తున్నారు. శ్రీ శార‌దా పీఠాధిప‌తి స్వరూపానందేంద్ర మ‌హాస్వామి, ఉత్తర పీఠాధిప‌తి స్వాత్మానందేంద్ర స‌ర‌స్వతి స్వామి ఆశీస్సుల‌తో లోక క‌ల్యాణం కోసం చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వహిస్తారు.ఈ హవనం కార్యక్రమంలో ముప్పై రెండు మంది వేద పండితులు, శాస్త్ర పండితులు పాల్గొంటారు. జనవరి 31న పూర్ణాహుతితో చ‌తుర్వేద హ‌వ‌నం ముగియనున్నది.

ఈ హ‌వ‌నంలో పాల్గొనే భ‌క్తుల‌కు సుఖ‌శాంతులు, ధ‌న‌ధాన్యాలు, దీర్ఘాయుష్షు చేకూరుతాయ‌ని పండితులు తెలిపారు. లోక క‌ల్యాణం కోసం 5 రోజుల పాటు ఈ చ‌తుర్వేద హ‌వ‌నం నిర్వ‌హిస్తారు. విశాఖ శారదా పీఠంలో స్వరూపానందేంద్ర మ‌హాస్వామిని కలిసి టీటీడీ జేఈఓ శ్రీమతి సదా భార్గవి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం చతుర్వేద హవనం ఏర్పాట్లను పరిశీలించారు. యజ్ఞ వేదిక, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక, భక్తుల కోసం చేపడుతున్న ఇతర ఇంజినీరింగ్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి విశాఖ శారదా పీఠంలో స్వ‌రూపానందేంద్ర మ‌హాస్వామివారిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం చతుర్వేద హవనం ఏర్పాట్లను పరిశీలించారు. చతుర్వేద హవనం రెండేళ్ల క్రితం కూడా విశాఖలో నిర్వహించారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా నిర్వహించలేదు. ఈసారి పరిస్థితులు సాధారణ స్థితికి చేరడంతో చతుర్వేద హవనం మళ్లీ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చక చకా జరుగుతున్నాయి.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×