BigTV English

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Elections: టెన్షన్ టెన్షన్… మరికొద్ది సేపట్లోనే ఆ ఎన్నికల ఫలితాలు..

Sri Lanka Presidential Elections: ప్రస్తుతం అంతా శ్రీలంకవైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శనివారం అక్కడ తదుపరి అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగింది. అయితే, ఆ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపును కూడా ప్రారంభించారు. ఈ లెక్కింపు మరికొద్ది గంటల్లోనే పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీలంక నూతన అధ్యక్షుడు ఎవరనేది ఈ ఫలితాలతో తేలిపోనున్నది.


కాగా, పోలైన ఓట్లలో మొదటగా పోస్టల్ ఓట్లను లెక్కించారు. ఆ తరువాత సాధారణ ఓట్లను లెక్కిస్తున్నారు. దాదాపు ఓట్ల లెక్కింపు ముగిసినట్లుగా తెలుస్తోంది. ఇంకొన్ని గంటల్లో విజయం ఎవరిదనేది తేలిపోనున్నది.

Also Read: పేజర్లు, వాకీటాకీలు, రాకెట్ లాంచింగ్ సైట్స్.. అసలు సినిమా ముందుందా ?


శనివారం రోజు మొత్తం 22 ఎలక్ట్రోరల్ జిల్లాల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. ఈ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగింది. పోలింగ్ అనంతరం ఆ దేశ ఎన్నికల కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ అత్యంత ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని ప్రకటించారు.

ఇదిలా ఉంటే.. శ్రీలంకలో రెండేళ్ల క్రితం తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సారి శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొన్నది. సమగి జన బలవేగయ పార్టీ నుంచి సజీత్ ప్రేమదాస, నేషనల్ పీపుల్స్ పవర్ పార్టీకి చెందిన అనుర కుమార దిసనాయకేతోపాటు ప్రస్తుత అధ్యక్షుడు విక్రమ్ సింఘే.. ఈ ముగ్గురూ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు నెలకొనడంతో ఈసారి ఎన్నికలు ఆసక్తిగా మారాయి. మరికొద్ది గంటల్లోనే శ్రీలంక అధ్యక్షుడు ఎవరనేది తేలిపోనున్నది.

Also Read: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×