E-Paper
Advertisement

Sunita Williams: వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్.. బెనిఫిట్స్,పెన్షన్ ఎంతో తెలుసా?

Sunita Williams: వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్.. బెనిఫిట్స్,పెన్షన్ ఎంతో తెలుసా?
Advertisement

Sunita Williams: నాసా అంతరిక్ష పరిశోధనల్లో రికార్డులు సృష్టించిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ రిటైర్మెంట్ తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 27 నుంచి ఆమె పదవీ విరమణ అమలులోకి వచ్చింది. ఈ విషయాన్ని నాసా అధికారులు వెల్లడించారు. సునీతా విలియమ్స్‌కు రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయి? ఎంత పెన్షన్ వస్తుంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

సునీతా విలియమ్స్ రిటైర్మెంట్

Advertisement

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మూడుసార్లు అంతరిక్ష యాత్ర చేశారు. వీటి ద్వారా దాదాపు 608 రోజులపాటు ఆమె అంతరిక్షంలో గడిపారు. నాసా హిస్టరీలో అత్యధిక కాలం స్పేస్‌లో ఉన్న సెకండ్ వ్యోమగామి ఈమె. 9 సార్లు పేస్ వాక్ చేశారు కూడా. మహిళా వ్యోమగామి అత్యధిక కాలం అంటే 62 గంటల 6 నిమిషాలపాటు స్పేస్ ‌వాక్ చేసిన రికార్డు ఆమె పేరు మీద ఉంది.

సునీత విలియమ్స్ కెరీర్ ఓకే? ఆమెకి రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి ప్రయోజనాలు అందుతాయి? నాసా నుంచి సునీతా విలియమ్స్‌కి ఎలాంటి పింఛన్ అందదు. కాకపోతే అమెరికా ప్రభుత్వ ఫెడరల్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ విభాగం కింద రకరకాల ప్రయోజనాలు అందనున్నాయి. సునీతా విలియమ్స్ సర్వీసు 27 ఏళ్లు. అత్యధిక వేతనం పొందిన 3 ఏళ్ల సగటు ఆధారంగా పింఛన్ అందనుంది.

Advertisement

రిటైర్మెంట్ తర్వాత ఆమెకి వచ్చే బెనిఫిట్స్ తెలుసా?

ఆ లెక్కన ఏడాదికి సుమారు 43,200 డాలర్లు. భారత కరెన్సీలో సుమారు రూ.36 లక్షల రావచ్చని ఓ అంచనా. దీనికితోడు ఆమె మునుపటి యూఎస్ నేవీలో కెప్టెన్‌గా చేసిన సేవ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటారని అంటున్నారు. ఆ లెక్కన వార్షిక జీతం రూ. 1.20 నుంచి 1.30 కోట్ల మధ్య ఉంటుందని ఓ అంచనా.

అమెరికా సామాజిక భద్రతా పథకం కింద ప్రతి నెలా అదనపు చెల్లింపులు అందనున్నాయి. సునీతా విలియమ్స్‌కు జీవితకాల ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, పొదుపు చేసిన థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్ నిధులు అందుబాటు ఉంటాయి. అంతరిక్ష ప్రయాణాల ప్రభావం వల్ల భవిష్యత్తులో మానసిక సమస్యల కోసం జీవితకాల వైద్య సహాయాన్ని అందించనుంది.

ALSO READ: పాపం పసివాడు.. ఐదేళ్ల చిన్నారిని నిర్బంధించిన ఇమిగ్రేషన్ అధికారులు

Related News

తగలబడిన పెర్రీ.. ఐదుగురు మృతి, 80 మంది మిస్సింగ్, ఫిలిప్పిన్స్‌‌లో ఘోరం

ప్రపంచ అధినేతల జీతాల లిస్ట్ ఇదే, సింగపూర్ ప్రధాని సాలరీ చూస్తే నోరెళ్లబెడతారు!

అమ్మబాబోయ్.. నూడుల్స్‌లో బతికున్న ఎలుక పిల్ల.. రెస్టారెంట్‌పై కేసు నమోదు!

నేపాల్‌లో ఆకస్మిక వరదలు.. మానవుల మూత్రం వల్ల అతిపెద్ద ముప్పు? పరిశోధనలో కొత్త విషయాలు

మిస్‌‌ వరల్డ్‌‌-2026 పోటీలు.. జోహెరి మెలాకు ప్రపంచ సుందరి కిరీటం, వియత్నాంలో అంగరంగ..

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

Big Stories

Advertisement
×