BigTV English

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే!

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్.. ఏయే శాఖలకు ఎంత కేటాయించారంటే!

Telangana Budget 2025: తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారం కట్టబెట్టారు మంత్రి విక్రమార్క. ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ పాలన సాగిస్తున్నామని, గత ప్రభుత్వలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు తెలిపారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నట్లు తన ప్రసంగంలో ప్రస్తావించారు.


కావాలని కొందరు దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు తెలిపారు. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.  ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులో  రెవిన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూల ధనం వ్యయం రూ. 36,504 కోట్లుగా ప్రతిపాదించారు.

తెలంగాణ స్థూల రాష్ట్ర ఉత్పత్తి 16,12,579 కోట్లు. గత ఏడాదితో పోల్చితే 10.1 శాతం వృద్ధి రేటు. దేశ జీడీపీ 3 కోట్ల 31 లక్షల 3 వేల 215 కోట్ల రూపాయలు. అంటే వృద్ధి రేటు దాదాపు 9.9 శాతం. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 3,79,751 కోట్లు. వృద్ధిరేటు 9.6 శాతంగా ఉంది. దేశ తలసరి ఆదాయం రూ.2,05,579, కాగా వృద్ ధిరేటు 8.8 శాతం ఉందని తెలిపారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,74,172 ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.


అంతకుముందు బుధవారం ఉదయం బడ్జెట్ 2025-26 పేపర్లను ఉపముఖ్యమంత్రి, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ కాపీలు అందజేశారు.

వివిధ రంగాలకు కేటాయింపు ఇలా..

రెైతు భరోసా పథకం రూ. 18,000 కోట్లు

వ్యవసాయం రూ. 24, 439 కోట్లు

పశుసంవర్థక శాఖ-రూ. 1,674 కోట్లు

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు – రూ.11,600 కోట్లు

పౌర సరఫరాల శాఖ- రూ. 5,734 కోట్లు

విద్యాశాఖ రూ. 28, 108 కోట్లు

పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూ. 31,605 కోట్లు

మహిళా స్త్రీ శిశు సంక్షేమశాఖ రూ. 2,862 కోట్లు

రైతు భరోసా పథకానికి – రూ.18 వేల కోట్లు

షెడ్యూల్ కులాల సంక్షేమం రూ.40, 232 కోట్లు

షెడ్యూల్ తెగల సంక్షేమం రూ. 17,169 కోట్లు

బీసీ సంక్షేమ శాఖ రూ.11, 405 కోట్లు

చేనేత రంగానికి రూ. 371 కోట్లు

మైనార్టీల సంక్షేమం రూ. 3,591 కోట్లు

పరిశ్రమల శాఖ రూ.3,527 కోట్లు

ఐటీ శాఖకు రూ. 774 కోట్లు

విద్యుత్ శాఖ రూ. 21, 221 కోట్లు

వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12, 393 కోట్లు

మున్సిపల్-పట్టణాభివృద్ధి శాఖ రూ.17,677 కోట్లు

నీటి పారుదల శాఖ రూ.27,373 కోట్లు

రోడ్లు-భవనాల శాఖ రూ.5,907 కోట్లు

టూరిజం శాఖ రూ.775 కోట్లు

క్రీడల శాఖకు రూ.465 కోట్లు

అడవులు-పర్యావరణ శాఖకు రూ.1,023 కోట్లు

దేవాదాయ శాఖకు రూ.190 కోట్లు

హోంశాఖకు రూ.10,188 కోట్లు

 

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×