BigTV English

Switzerland : స్విట్జర్లాండ్.. ఆవిష్కరణల్లో మేటి

Switzerland : స్విట్జర్లాండ్.. ఆవిష్కరణల్లో మేటి

Switzerland : ఆవిష్కరణల్లో ఏ దేశం మేటి? అంటే కచ్చితంగా స్విట్జర్లాండే అని చెప్పాలి. ఇన్నొవేషన్‌లో ఆ దేశం 13 వ సారి వరల్డ్ లీడర్‌గా నిలిచింది. ప్రపంచ మేధోహక్కుల సంస్థ (WIPO) 2023వ సంవత్సరానికి ప్రపంచ ఆవిష్కరణల సూచీ(GII)ని విడుదల చేసింది.


132 దేశాల్లో నవకల్పనల స్థాయులను ఆ సంస్థ మదింపు చేసి ఈ సూచీని రూపొందించింది. ఇప్పటికీ ఇన్నొవేషన్ వికసించే దశలోనే ఉందని ఆ సూచీ వెల్లడించింది. కరోనా వైరస్, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పరిశోధనలపై తీవ్రంగా ఉందని పేర్కొంది.

ఈ ర్యాంకింగ్స్‌లో స్విట్జర్లాండ్ అగ్రభాగాన ఉంది. వందకు 67.6 స్కోర్‌తో 13వ సారి వరల్డ్ లీడర్‌గా నిలవడం విశేషం. స్వీడన్, అమెరికా దేశాలు 2, 3 స్థానాల్లో నిలిచాయి. స్వీడన్‌కు 64.2, అగ్రరాజ్యానికి 63.5 స్కోర్ లభించింది.


ఇక బ్రిటన్ 62.4, సింగపూర్ 61.5, ఫిన్లాండ్ 61.2, నెదర్లాండ్స్ 60.4, జర్మనీ 53.8 స్కోర్ సాధించాయి. ఇన్నొవేటివ్ దేశంగా చైనా 12వ స్థానంలో నిలిచింది. 2018లో 17వ ర్యాంక్‌లో ఉన్న డ్రాగన్ ఐదేళ్లలోనే ఐదు స్థానాలు ఎగబాకింది.

ఇక భారత్‌కు 40వ ర్యాంక్ దక్కింది. అయితే అల్పాదాయ దేశాల కేటగిరీలో చూస్తే నవకల్పనల్లో మన దేశమే మొదటి స్థానంలో ఉంది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×